Reliance Jewels: బెల్లా కలెక్షన్ ఆవిష్కరించిన రిలయన్స్ జ్యువెల్స్.. కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రత్యేక డిజైన్లు..
Reliance Jewels: రిలయన్స్ జ్యువెల్స్ తమ ప్రత్యేకమైన ఆభరణాల కలెక్షన్లో నేటి మహిళల కోసం సరికొత్త డిజైన్ “బెల్లా- ప్రతీ రోజు ప్రత్యేకం’ ఆవిష్కరించింది.
Reliance Jewels: రిలయన్స్ జ్యువెల్స్ తమ ప్రత్యేకమైన ఆభరణాల కలెక్షన్లో నేటి మహిళల కోసం సరికొత్త డిజైన్ “బెల్లా- ప్రతీ రోజు ప్రత్యేకం’ ఆవిష్కరించింది. ఫ్యాషన్ ఆభరణాల్లో ఈ బ్రాండ్ ఇప్పటికే సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు ఉన్న ఈ కొత్త కలెక్షన్ ప్రతీ విలువైన ఆభరణాన్ని సమానంగా చూపుతుంది.
బెల్లా అంటే కలెక్షన్ కంటే ఎక్కువ. అది ఒక యాటిట్యూడ్. అది ఒక స్టేట్మెంట్. మహిళలను ప్రతీరోజు ప్రత్యేకంగా తీర్చిదిద్దేలా డిజైన్ చేయబడింది ఈ కలెక్షన్. కనీస స్థాయిలో సమకాలీన ఫ్యాషన్‌కి అనుగుణంగా ఉండే బెల్లా ఆభరణాలు నేటి మహిళలు కొనుగోలు చేసేందుకు సరైనవి. రోజువారీ ధరించేందుకు భారీ డిజైన్లకు ఈ ట్రింకెట్స్ చక్కని ప్రత్యామ్నాయం. కచ్చితత్వం, సున్నితమైన డిజైన్, అద్భుతమైన కూర్పుతో కూడిన ఈ సుందరమైన కలెక్షన్స్ మీ రోజువారీ మధురక్షణాలు.
చక్కని డిన్నర్స్, ప్రెండ్స్‌తో షాపింగ్, సండే బ్రంచ్లు, కుటుంబ సభ్యులతో సెలవులు, ఇంట్లో నిర్వహించే చిన్న వేడుకలు, వీకెండ్ పార్టీలు, డిన్నర్ డేట్స్ వంటి సందర్భాలకు చక్కగా సరిపోతాయి. నిత్యం కష్టపడి పనిచేస్తూ జీవితంలోని మామూలు సమయాన్ని ఆస్వాదించే ప్రతీ మహిళ శక్తి, అందానికి ప్రతీ రూపంగా నిలుస్తాయి ఈ కలెక్షన్స్. ఒక వరుస, అనేక వరుసల చైన్లు, ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్లో పొదిగిన ఉంగరాలు కూడా ఉన్నాయి ఈ కొత్త డిజైన్లలో. రూ.6750/-నుంచి ప్రారంభమయ్యే ఈ కలెక్షన్స్ ధర అందరికీ అందుబాటులో ఉన్నాయి.
రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన బెల్లా ఫిల్మ్ మొత్తం కలెక్షన్, డిజైన్‌ని చూపుతుంది. స్వతంత్రంగా, నిర్భయంగా, సంతోషంగా ఉంటూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ ప్రతీరోజు ఏదైనా సాధించాలనే తపన కలిగిన నేటి మహిళకు ఇది ఒక నీరాజనం. కొత్త కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. “ బెల్లా కలెక్షన్స్‌ని రిలయన్స్ జ్యువెల్స్‌లో లాంచ్ చేస్తుండటం మాకు సంతోషం కలిగిస్తోంది. అద్భుతమైన సౌందర్యానికి ప్రతిబింబంగా నిలిచే ఈ కలెక్షన్‌లోని ప్రతీ డిజైన్ నేటి మహిళ స్టైల్, సౌందర్యాన్ని పెంచే విధంగా ఉంటాయి. సమకాలీన ఆభరణాల్లో ఈ సరసమైన రేంజ్ అందిస్తుండటం మా కొనుగోలుదారులపై మేము చూపే శ్రద్ధను తెలియజేస్తుంది. ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దిన డిజైన్లు నేటి మహిళలను కచ్చితంగా ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. రాబోయే పండగ సీజన్ కోసం మేము మా డిజైన్లను నిరంతరం నవీకరిస్తూనే ఉంటాం” అన్నారు.
భారతదేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ జ్యువెల్స్ ఔట్లెట్స్ అన్నింటిలో బెల్లా కలెక్షన్ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో మీరు చేసే కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్ కింది స్వర్ణాభరణాల మేకింగ్ ఛార్జీల్లో 20% వరకు, డైమండ్ ఆభరణాలపై 20% పొందవచ్చు. అన్ని ప్రాంతాల్లోని మా స్టోర్ మేనేజర్లు మా స్టోర్లను సందర్శించే కుటుంబాల భద్రత కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించి వాటిని అమలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన కలెక్షన్స్ రిలయన్స్ జ్యువెల్స్ ప్రతిష్ఠాత్మక షోరూములు, దేశవ్యాప్తంగా షాప్-ఇన్-షాప్స్‌తో పాటు రిలయన్స్ జ్యువెల్స్ వెబ్‌సైట్ https://www.reliancejewels.com లో ప్రత్యేకంగా లభిస్తాయి.
భారతదేశంలో టాప్ 10 విశ్వసనీయమైన బ్రాండ్స్‌లో ఒకటైన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్లో భాగం రిలయన్స్ జ్యువెల్స్. అద్భుతమైన, విస్తృత శ్రేణి గోల్డ్, డైమండ్, ప్లాటినం & సిల్వర్ ఆభరణాల కలెక్షన్స్ అందిస్తుంది ఈ బ్రాండ్. డిజైన్, నైపుణ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కళలు, హస్తకళలు, ఘనమైన భారతీయ వారసత్వం నుంచి ప్రేరణ పొంది ప్రత్యేకమైన, వైవిధ్యమైన డిజైనర్ కలెక్షన్స్‌ని కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. జీవితంలోని ప్రతీ ప్రత్యేక క్షణాన్ని స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన బంగారపు తాడుతో వేడుకగా జరుపుకోవాలని రిలయన్స్ జ్యువెల్స్ నమ్ముతుంది.
భారతదేశంలో 100+ నగరాల్లో 200+ ఫ్లాగ్షిప్ షోరూమ్లు & షాప్-ఇన్ షాపులు కలిగిన రిలయన్స్ జ్యువెల్స్ వాటిని గణనీయంగా విస్తరిస్తోంది. ఖాతాదారులకు అనుపమానమైన సేవలు, ఒక ప్రత్యేకమైన ఆభరణాల కొనుగోలు షాపింగ్ అనుభూతిని అందించేందుకు బ్రాండ్ ఎల్లవేళల కృషి చేస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో స్వర్ణ, వజ్రాభరణాలు అత్యంత సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జీరో వేస్టేజ్, సరసరమైన తయారీ ఛార్జీలు కొనుగోలుదారులకు 100% సంతృప్తిని అందిస్తాయి.
రిలయన్స్ జ్యువెల్స్ 100 శాతం స్వచ్ఛత, పారదర్శకమైన ధరల విధానం, ప్రతీ వస్తువుపై హమీపూర్వక నాణ్యతను అందిస్తుంది. 100 శాతం బీఐఎస్ హాల్మార్క్డ్ బంగారం, అంతర్జాతీయంగా స్వతంత్ర ధ్రువీకరణ ప్రయోగశాలలు ధ్రువీకరించిన ఆభరణాలను మాత్రమే ఈ బ్రాండ్ విక్రయిస్తుంది. రిపేర్ల కోసం క్యూసీ టెక్రూమ్స్‌తో పాటు బంగారం స్వచ్ఛతను కొనుగోలుదారులు ఉచితంగా తెలుసుకునేందుకు క్యారెట్ మీటర్, ఇంకా ఎన్నో సేవలను రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. ప్రతీ కొనుగోలుపై లాయల్టీ పాయింట్లను కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది.