Black Rice Benefits: ఏపీలో పెరుగుతున్న కొత్త వంగడాల సాగు.. బ్లాక్ రైస్‌తో ఎన్నో ప్రయోజనాలు..!

Black Rice Cultivation: ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలకు గిరాకీ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో బ్లాక్ రైస్ పేరును చాలా మంది జపిస్తున్నారు.

Black Rice Benefits: ఏపీలో పెరుగుతున్న కొత్త వంగడాల సాగు.. బ్లాక్ రైస్‌తో ఎన్నో ప్రయోజనాలు..!
Black Rice Cultivation Min
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 14, 2021 | 7:05 PM

Black Rice Benefits: వైట్ రైస్.. ఇప్పుడు వైట్ రైస్ తినేందుకు అందరూ వెనుకాడుతున్నారు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని ఎలాంటి ప్రోటీన్స్ ఉండవు అనేది వారి ఉద్దేశం. చాలామంది వైట్ రైస్ తినడం కూడా మానేశారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలకు గిరాకీ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో బ్లాక్ రైస్ పేరును చాలా మంది జపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బ్లాక్ రైస్ సాగు పెరుగుతోంది.

బ్లాక్ రైస్.. ప్రస్తుతం ప్రజల నోళ్లలో ఎక్కువగా నానుతున్న పదం.. పోషకాలు సమృద్ధిగా ఉండటం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం, ఫైబర్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో చాలామంది ఈ బియ్యాన్ని తినేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో సాగుపైన కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై మక్కువ పెరిగింది. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలకు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో బ్లాక్ రైస్ పేరును చాలా మంది జపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బ్లాక్ రైస్ సాగు పెరుగుతోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో బ్లాక్ రైస్ సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది

పోషక విలువలతో కూడి కొత్త వంగడాల సాగు కర్నూలు జిల్లా గొస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మద్దిలేటి అనే రైతు.. బియ్యంలో ఎన్ని కొత్త రకాలు సాగులోకి వస్తున్నాయో వాటిని సాగు చేయడంలో దిట్ట. బ్లాక్ రైస్, రెడ్ రైస్, చిట్టి ముత్యాలు.. ఇలా కొత్త కొత్త రకాలను సాగు చేస్తుంటారు. ఇందులో బ్లాక్ రైస్ అత్యంత పోషక విలువలు ఉన్న బియ్యం. ప్రతి 100 గ్రాముల నల్ల బియ్యం లో 8.5 గ్రాముల ప్రొటీన్లు, 3.5 గ్రాముల ఐరన్, 4.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది.. సహజంగా తెల్లగా ఉండే బియ్యం రకాలను చూసి ఉంటాం.. కానీ, బ్లాక్ రైస్ మాత్రం నల్లగా ఉంటాయి. పూర్వ కాలంలో వీటిని కేవలం చక్రవర్తులు వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినడానికి కేటాయించేవారు అని అందరికీ తెలిసిందే. దీంతో వీటికి చక్రవర్తుల బియ్యం అనే పేరు కూడా వచ్చింది.

బ్లాక్ రైస్ దిగుబడి ఆదాయం సాధారణ బియ్యము కంటే బ్లాక్ రైస్ దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే, ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది. సాధారణ బియ్యం ఎకరాకు 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. అదే బ్లాక్ రైస్ అయితే, 10 నుంచి 15 బస్తాలు మాత్రమే వస్తుంది. అయితే, బ్లాక్ రైస్ రకం ధాన్యం పంట బాగా ఎత్తుగా ఎదగడం వల్ల గాలి వీస్తే పడిపోతుంది. అందువల్ల రైతులు ఒకింత వెనకడుగు వేస్తుంటారు. సాధారణ బియ్యం కిలో 40 నుంచి 50 రూపాయల వరకు ఉంటే బ్లాక్ రైస్ మాత్రం కిలో 150 నుండి 180 వరకు పలుకుతోంది. బ్లాక్ రైస్ సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. మామూలు బియ్యం ఎకరాకు 28 వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి అవుతుండగా దీనికి మాత్రం 20,000 సరిపోతుంది. మామూలు బియ్యానికి కి క్రిమిసంహారక ఎరువులు రసాయన ఎరువులు మందులు తప్పనిసరి. కానీ బ్లాక్ రైస్ గోవు ఆధారిత జీవామృతం, గోమూత్రం ఆవు పేడ సేంద్రియ ఎరువులు వినియోగిస్తారు. ఫలితంగా తెగుళ్ల బెడద ఉండదు పురుగుమందుల పిచికారి చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణ వరి పంట 120 రోజుల్లో చేతికి వస్తుండగా బ్లాక్ రైస్ మొత్తం 140 రోజులనుంచి 150 రోజులు పడుతుంది.

బ్లాక్ రైస్ ప్రయోజనాలు బ్లాక్ రైస్ తో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ బియ్యంలో ఉండే ఆంకోసైనిన్స్ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి. బ్లాక్ రేసులో పోషకాల శాతం ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కేరళ రాష్ట్రంలో ఆయుర్వేద మందు లో ఈ బ్లాక్ రైస్ ను ఉపయోగిస్తారు. మధుమేహం క్యాన్సర్ గుండెజబ్బులను నియంత్రిస్తాయి. అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అలాగే విటమిన్‌–బి, ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ విలువలు బ్లాక్ రైస్ లో ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కణాలను శుభ్రపరుస్తుంది. అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. నల్ల బియ్యం లో “యాంతో సైనింలా “.. అనేది ఎక్కువగా ఉండటంతో కంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యలు సూచిస్తున్నారు…

బ్లాక్ రైస్ ఉత్పత్తికి ప్రభుత్వ చర్యలు ఈ బ్లాక్ రైస్ అనేది కర్నూలు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు. మహారాష్ట్రలో ఎక్కువ శాతం రైతులు సాగు చేస్తున్నారు. బ్లాక్ రైస్ లో ప్రభుత్వమే అధికారికంగా ప్రోత్సహించాలంటే ఐదు సార్లు ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 2 ట్రయల్స్ మాత్రమే పూర్తయ్యాయి. అద్భుతమైన రిజల్ట్ వచ్చాయని మరో మూడు ట్రయల్స్ పూర్తయితే ప్రభుత్వం ప్రోత్సహిస్తే విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే, ఈ బ్లాక్ రైస్ సాగులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని అధికారులు అంటున్నారు.. బ్లాక్ రైస్ గురించి ఇంకా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో మార్కెటింగ్ సమస్య ఉంది. వడ్లు బియ్యం అన్నం అన్ని నల్లగా ఉండటం ఒక మైనస్ పాయింట్ అని సూచిస్తున్నారు. పైగా ధర కూడా ఎక్కువగా ఉండటం, బ్లాక్ రైస్ ను పట్టే రైస్ మిల్స్ ప్రత్యేకంగా లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. అదే ప్రభుత్వం అధికారికంగా బ్లాక్ రైస్ ను పరిచయం చేస్తే మంచిదని సూచిస్తున్నారు అధికారులు

ప్రస్తుతానికి కర్నూలు జిల్లాలోని నంద్యాల డివిజన్ లో మాత్రమే వంద ఎకరాల వరకు బ్లాక్ రైస్ ప్రయోగాత్మకంగా సాగు అవుతుంది. దీంతోపాటు మరికొంతమంది రైతులు రెడ్ రైస్, చిట్టి ముత్యాలు అనే నూతన వంగడాలు కూడా సాగు సాగుచేస్తున్న రు. మొత్తం మీద బ్లాక్ రేసులో లో పోషక విలువలు అధికంగా ఉండటంతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది..

నాగిరెడ్డి, టీవీ 9 ప్రతినిధి, కర్నూలు జిల్లా.

Read Also…  Priyanka Gandhi: బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ సలహాలు.. కాంగ్రెస్ కమిటీ తొలి భేటీలో అనూహ్య నిర్ణయాలు

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?