South Central Railway: పండుగల వేళ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్‌ను పొడగిస్తూ..
South Central Railway: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సౌత్ ఇండియన్ రైల్వే శుభ వార్త చెప్పింది. పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది...

South Central Railway: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సౌత్ ఇండియన్ రైల్వే శుభ వార్త చెప్పింది. పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. సౌత్ ఇండియన్ రైల్వే ప్రకటించిన ఈ జాబితాలో డైలీ, వీక్లీ సర్వీసులు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన జాబితాలో పొడగించిన ప్రత్యేక రైల్ సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి..
* హౌరా – హైదరాబాద్‌ల మధ్య ప్రతీరోజూ నడిచే 08645 ట్రైన్ సర్వీస్‌ను 28-09-2021 నుంచి 31-12-2021 వరకు పొడగించారు.
* హైదరాబాద్ – హౌరాల మధ్య ప్రతిరోజూ నడిచే 08646 ట్రైన్ సర్వీస్‌ను 30-09-2021 నుంచి 02-01-2021 వరకు పొడగించారు.
* షాలిమార్ – సికింద్రాబాద్-షాలిమార్ (02449/50)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్ సర్వీస్‌ను 06-10-2021 నుంచి 31-12-2021 వరకు పొడగించారు.
* హతియా – యశ్వంత్ పూర్ – హతియాల మధ్య వారానికి రెండు రోజులు నడిచే ఈ ట్రైన్ సర్వీస్ (02835/36) ను 28-09-2021 నుంచి 30-12-2021 వరకు పొడగించారు.
* హౌరా – మైసూరు – హౌరా (08117/08118)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్ సర్వీసులను 01-10-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.
* హౌరా – యశ్వంత్‌పపూర్ – హౌరా (02873/74)ల మధ్య ప్రతి రోజూ నడిచే ట్రైన్ సర్వీసులను 28-09-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.
* హౌరా – వాస్కొడిగామా – హౌరా (08047/48)ల మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ సర్వీసులను 27-09-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.
* హౌరా – పాండిచ్చరి – హౌరా (02867/68)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్ సేవలను 03-10-2021 నుంచి 29-12-2021కి పొడగించారు.
* హౌరా – ఎర్నాకులమ్ – హౌరా (02877/78)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్ సేవలను 02-10-2021 నుంచి 27-12-2021కి పొడగించారు.
* హతియా – బెంగళూరు – హతియా (08637/38)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్ సేవలను 02-10-2021 నుంచి 28-12-2021కి పొడగించారు.
18 Special Trains extended to Run #SpecialTrains pic.twitter.com/AORbIFGjBM
— South Central Railway (@SCRailwayIndia) September 14, 2021
Post Office MIS Scheme: ఒక్కసారి డబ్బులు డిపాజిట్ చేస్తే చాలు.. నెలకు 5000 రూపాయలు వస్తూనే ఉంటాయి..