Post Office MIS Scheme: ఒక్కసారి డబ్బులు డిపాజిట్ చేస్తే చాలు.. నెలకు 5000 రూపాయలు వస్తూనే ఉంటాయి..
Post Office MIS Scheme : పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడిని కూడా అందిస్తుంది. పెట్టుబడిదారులు భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తులు
Post Office MIS Scheme : పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడిని కూడా అందిస్తుంది. పెట్టుబడిదారులు భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తులు కావడానికి ఇండియా పోస్ట్ నెలవారీ ఆదాయ పథకాన్ని (MIS) ప్రవేశపెట్టింది. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెల డబ్బులు పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్‌లో చేరాలంటే కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా తెరడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఖాతాలో గరిష్ట పెట్టుబడి రూ.9 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఇండియా పోస్ట్ MIS ప్లాన్ పై 6.8% వార్షిక వడ్డీని అందిస్తోంది.
నెలకు 5000 రూపాయలు ఎలా పొందాలి? ముందుగా డిపాజిటర్ పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ తెరవాలి. ఈ అకౌంట్‌ను భార్యాభర్తలు కూడా తెరవవచ్చు. ఇందులో 9 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. దీనిపై సంవత్సరానికి రూ .59,400 వడ్డీ పొందుతారు. అంటే నెలవారీ ఆదాయం 4950 రూపాయలు. సింగిల్ అకౌంట్ విషయంలో 4.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 29,600 రూపాయల వడ్డీ లభిస్తుంది. డిపాజిటర్ ఈ డబ్బును 7.6 శాతం వడ్డీ రేటుతో పొందుతారు.
మీరు పోస్ట్ ఆఫీస్ ప్రవేశ పెట్టిన ఎలాంటి ప్లాన్‌లోనైనా డబ్బు పెట్టుబడి పెడితే, మీరు మీ డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. దీనిలో మీరు పెట్టుబడి పెడితే.. మీరు కొన్ని సంవత్సరాలలో కోటీశ్వరుడు కావచ్చు. కరోనా వ్యాప్తితో ప్రజలు ఇప్పటికే ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది పెట్టుబడిదారులు తమకు తక్కువ రిస్క్ ఉన్న మంచి రాబడిని పొందగల ఎంపిక కోసం చూస్తున్న సంగతి తెలిసిందే.