AP Covid19: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కలవరం.. మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. కొత్తగా 11 మంది మృత్యువాత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న కాస్త తగ్గిన కేసులు ఇవాళ మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న కాస్త తగ్గిన కేసులు ఇవాళ మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 62,252 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 1,445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 20,33,419కు చేరుకుంది. ఇక, నిన్న ఒక్కరోజే కరోనా ధాటికి 11 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కాటుకు 14,030 మంది మృత్యువాతపడ్డారు.
ఇక, ప్రస్తుతం ఏపీలో 14,603 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 1,243 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, 20,04,786 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా రికవరీ అయ్యారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఈ సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,74,75,461 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రంలో వివిధ జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…