Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: కరోనాపై పోరులో మరో మైలురాయిని చేరిన తెలంగాణ రాష్ట్రం.. ఈ నెలాఖరులోపు మరో టార్గెట్

రాష్ట్ర ఆరోగ్య శాఖ, జిహెచ్‌ఎంసి, జిల్లా అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు

Corona: కరోనాపై పోరులో మరో మైలురాయిని చేరిన తెలంగాణ రాష్ట్రం.. ఈ నెలాఖరులోపు మరో టార్గెట్
Somesh Kumar
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 15, 2021 | 7:06 PM

Telangana – Corona – Vaccination – Somesh Kumar: రాష్ట్ర ఆరోగ్య శాఖ, జిహెచ్‌ఎంసి, జిల్లా అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు వేసినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో 2 కోట్ల టీకాల లక్ష్యాన్ని సాధించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారులను అభినందించారు. అర్హులైన వ్యక్తులకు టీకాలు వేసేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

టీకా ప్రక్రియ జనవరి, 2021 లో ప్రారంభమైందని, ఒక కోటి డోసులు 25 జూన్, 2021 న అంటే 165 రోజుల్లో వేయడం పూర్తయిందని, మొత్తం 2 కోట్ల డోసులను 15 సెప్టెంబర్ 2021 వరకు అంటే 78 రోజులలో చేరుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో మరో కోటి డోసులు వేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు.

రాష్ట్రంలో 52 శాతం అర్హులైన వారికి మొదటి డోసు ఇవ్వడం జరిగిందని, GHMC లో దాదాపు అందరికి మొదటి డోసు టీకాలు వేశామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హై ఎక్స్ పోజర్ గ్రూప్‌లలో 38 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి SAM రిజ్వీ, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ G. శ్రీనివాస్ రావు, OSD to Hon’ble CM డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

Read also:  AP Current Charges: విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదు, భవిష్యత్తులో కూడా పెంచబోం: ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని