NEET Aspirant: తమ పిల్లలు డాక్టర్‌గా చూడాలని ఆశపడ్డ తల్లిదండ్రులకు నిరాశ.. మూడు రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

జాతీయ వైద్య విద్యా అర్హత పరీక్ష ‘నీట్’ ప‌రీక్ష భ‌యం.. మ‌రో విద్యార్థిని బ‌లి తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో నీట్కి వ్యతిరేకంగా మూడు రోజుల్లో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

NEET Aspirant: తమ పిల్లలు డాక్టర్‌గా చూడాలని ఆశపడ్డ తల్లిదండ్రులకు నిరాశ.. మూడు రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
Student Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 15, 2021 | 5:59 PM

NEET Aspirant Student: జాతీయ వైద్య విద్యా అర్హత పరీక్ష ‘నీట్’ ప‌రీక్ష భ‌యం.. మ‌రో విద్యార్థిని బ‌లి తీసుకుంది. సెప్టెంబ‌ర్ 12న ధనుష్ అనే విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేడనే భయంతో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని అరియలూరు జిల్లాకు చెందిన కనిమొళి అనే విద్యార్థి మ‌రో విద్యార్థి నీట్ ప‌రీక్ష ఫెయిల్ అవుతానేమోన‌ని భ‌యంతో ఆత్మహ‌త్య చేసుకొంది. తాజాగా మరో విద్యార్థిని నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో నీట్కి వ్యతిరేకంగా మూడు రోజుల్లో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నీట్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండడం, నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే… వెల్లూర్ జిల్లా కి చెందిన సౌందర్య.. తోట్టపాలయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆదివారం జరిగిన పరీక్షకు సౌందర్య హాజరైంది. తర్వాత శోకవదనంతో ఇంటికి తిరిగొచ్చింది. పరీక్షలో ప్రశ్నలు చాలా కఠినంగా వుండటంతో సరిగా రాయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పినా లాభం లేకపోయింది.

బుధవారం సౌందర్య తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్రలేచిన కుటుంబసభ్యులు గమనించి, కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించినా కానీ అప్పటికే ఆమె మరణించింది. పోలీసులు సౌందర్య మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫోన్‌లో హెల్త్‌ కౌన్సెలింగ్‌ రాష్ట్రమంతటా నీట్‌ రాసిన విద్యార్థులకు ఫోన్‌లో హెల్త్‌ కౌన్సెలింగ్‌ నిర్వ హించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. నీట్‌ పరీక్షలకు భయపడి ధనుష్‌, కనిమొళి , సౌందర్య అనే విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలపై ఆయన స్పందించారు. నీట్‌ రద్దు కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని, సోమవారం శాసనసభలో నీట్‌కు వ్యతిరేకంగా చేసిన ముసాయిదా చట్టం గవర్నర్‌ పరిశీలనకు పంపినట్టు తెలిపారు. త్వరలో ఆ బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లనుందని వెల్లడించారు.

నీట్‌ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడకూడదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. అయినా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నీట్‌ రాసిన విద్యార్థులందరికీ ఫోన్‌లో హెల్త్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. విద్యార్థులు 104 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే మానసిక వైద్యనిపుణులు వారికి కౌన్సెలింగ్‌ ఇస్తామని ప్రకటించారు. ఈ సదుపాయాన్ని నీట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది.

ఇదిలావుంటే, త‌మిళ‌నాడులోని డీఎంకే ప్రభుత్వం నీట్‌(NEET)ను వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే , అసెంబ్లీలో తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని కేంద్రాన్ని కోరడానికి ఒక బిల్లును ఆమోదించింది. ప‌లు పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌యంలో నీట్ రద్దు చేస్తామ‌న వాగ్దానాలు చేశాయి. నీట్ వ‌ల్ల గ్రామీణ విద్యార్థుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కంది. అసెంబ్లీలో అన్నాడీఎంకే, డీఎంకే రెండుపార్టీలు నీట్ ర‌ద్దుకు తీర్మానం చేశాయి. అయినీ నీట్ ర‌ద్దు కేంద్రం ప‌రిధిలోని అంశం కావ‌డంతో తీర్మానం వ‌ల్ల ప్రయోజ‌నం చేకూర‌లేదు.

Read Also… Mumaith Khan: డ్రగ్స్‌ కేసులో ముగిసిన ముబైత్‌ ఖాన్‌ ఈడీ విచారణ.. 7 గంటల విచారణలో ఏం తేలిందంటే..

AP Current Charges: విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదు, భవిష్యత్తులో కూడా పెంచబోం: ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని