Saidabad Accused: వందలాది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. టోల్‌ప్లాజా వద్ద నిందితుడి పోలికలతో ఉన్న వ్యక్తి..?

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 15, 2021 | 5:17 PM

హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితుడి ఆచూకీ కోసం రివార్డు సైతం ప్రకటించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు.

Saidabad Accused: వందలాది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. టోల్‌ప్లాజా వద్ద నిందితుడి పోలికలతో ఉన్న వ్యక్తి..?
Saidabad Rape Accused

Follow us on

Saidabad Rape Case Accused: హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితుడి ఆచూకీ కోసం రివార్డు సైతం ప్రకటించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు. దారుణం జరిగి ఇప్పటికే వారం రోజులు కావొస్తున్న నిందితుడి జాడ మాత్రం దొరకలేదు. చిన్నారిని రేప్‌చేసి.. కిరాతకంగా మర్డర్‌ చేసేసి పారిపోయాడు. మరోవైపు, ప్రజా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

ఎలాంటి క్రైమ్‌ జరిగినా.. పోలీసులు ముందు నమ్ముకునేది టెక్నాలజీనే. ఫోన్‌ నెంబర్‌ ట్రేస్‌ చేయడం.. సీసీటీవీల ద్వారా వాడిని గుర్తించి పట్టుకోవడం చేస్తున్నారు. కాని.. నిందితుడు ఫోన్‌ వాడకపోవడం పోలీసులకు పెద్దచిక్కే వచ్చిపడింది. ఈ కేసులో టెక్నాలజీ సగమే ఉపయోగపడుతోంది. మిగితాదంతా ఫీల్డ్‌ వర్క్‌ చేయాల్సిందే. హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ఐపీఎస్‌ సజ్జనార్‌ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈ రేపిస్టు ఒక ఆవారా కాబట్టి బస్టాండుల్లో, ఫుట్‌పాత్‌లపై పార్కులు ఇతర ప్రదేశాల్లో కనిపించే అవకాశాలున్నాయని ఈ దిశగా గాలం వేసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిందితుడు రాజుని పట్టిస్తే పదిలక్షల రివార్డును కూడా ప్రకటించింది హైదరాబాద్ పోలీస్. టెక్నికల్‌గా సీసీటీవీలను కనెక్ట్‌ చేసుకుంటూ వెళ్తున్నారు పోలీసులు. ఇప్పటికే బస్టాండ్స్‌, రైల్వే స్టేషన్లలో చెకింగ్‌ను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్‌కు కనెక్ట్‌ అయ్యే అన్ని హైవేలను జల్లెడపడుతున్నారు. వరంగల్‌ హైవే, విజయవాడ హైవే, సాగర్‌, శ్రీశైలం హైవేల్లో గాలింపు చేపట్టారు. అయితే, ఇదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగి టోల్ ఫ్లాజాను దాటుకుంటూ నిందితుడు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. అచ్చం నిందితుడి పోలికలతో కూడిన వ్యక్తి జాతీయ రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్‌ల్లో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Saidabad Accused Raju

Saidabad Accused Raju

గతంలో ఫోటో లను పట్టుకుని నిందితులను పట్టుకునేవారు పోలీసులు. టెక్నికల్ గా ఎంత ట్రై చేసినా కుదరక పోవడంతో.. తమ దగ్గరున్న నిందితుడి ఫోటో ఆధారంగా పట్టుకునే యత్నం చేస్తున్నారు పోలీసులు. దాదాపు వెయ్యిమంది పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి- యాదాద్రి- నల్గొండ- కరీంనగర్ జిల్లా పోలీసులను అలెర్ట్ చేశారు అధికారులు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.. నిందితుడి దగ్గర సెల్ ఫోన్ లేకపోవడంతో ఆచూకీ దొరకడం- పోలీసులకు కష్టంగా మారింది.

ఈ రేపిస్టును పట్టివ్వండి.. రూ. 10 లక్షలు రివార్డు పొందండి.. వీడి ఆచూకీ తెలిస్తే… ఈ నెంబర్లకు ఫోన్ చేయండి.. 9490616366, 9490616627 సెర్చ్ హిమ్- క్యాచ్ హిమ్.. ఇదీ పోలీస్ వారి ప్రకటన. వందలాది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల కంటికి చిక్కకుండా రాజు తప్పించుకు తిరుగుతున్నట్టు గుర్తించారు. రాజు తలకు ఎర్రటి టవల్ కట్టుకుని మరీ జాగ్రత్త పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు పోలీసులు.ఇది కేవలం పది లక్షల రూపాయల కోసం కాదు. ఒక సామాజిక బాధ్యత. మనందరి పై ఉన్న గురుతర భాద్యత. అందరూ వెతకండి. వాడ్ని వెతికి పట్టండి. ఇలాంటి వాళ్లను వెంటాడి వేటాడి వెతికి పట్టండి. చిన్నారి ఆత్మకు శాంతి జరిగేలా కృషి చేద్దాం పదండి.

సీసీటీవీల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాదాపు 1000 సీసీటీవీ కెమెరాల డేటాను అనాలసిస్ చేస్తున్నారు. నిందితుడు ఉప్పల్ వరకు వెళ్లినట్లు గుర్తించారు. ఉప్పల్ సిగ్నల్ దగ్గర నిందితుడు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అక్కడ ఓ వైన్ షాపు దగ్గర తన చేతిలో ఉన్న కవర్‌ను రాజు పడేశాడు. ఈ కవర్‌ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కవర్‌లో కల్లు సీసా, టవల్ స్వాధీనం చేసుకున్నారు. రాజు చేతిలో రూ.700లు ఉన్నట్లు భావిస్తున్నారు. దాదాపు 180 వైన్ షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. రాత్రిలోగా నిందితుడు రాజును పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిందితుడు రాజు ఫోటో ని చూపెట్టి పోలీసులు ప్రచారం చేస్తున్నారు.

నిందితుడిని ఇప్పటికీ పట్టుకోకపోవడంపై మండిపడ్డారు వైఎస్సార్‌ టీపీ చీఫ్‌ షర్మిల. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. అటు బాధిత కుటుంబానికి 10కోట్ల పరిహారం ఇప్పించాలని.. వారి కుటుంబానికి న్యాయం జరిగేవరకు ఇక్కడే ధర్నాకు కూర్చుంటానని ప్రకటించారామె. తెలంగాణలోనే కాదు.. అటు అమెరికాలోనూ ఈ దుర్ఘటనపై నిరసనలు పెల్లుబికాయి. చిన్నారి రేప్‌ అండ్‌ మర్డర్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్‌ డీసీలో ఎన్నారైలు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Read Also….  YS Sharmila: పదికోట్ల పరిహారం ప్రకటించాలి.. కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష: వైఎస్ షర్మిల

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu