Black Cat: గృహ ప్రవేశం రోజు నల్ల పిల్లి వస్తే అదృష్టం కలిసివస్తుందట.. ఎక్కడో తెలుసా..
మన దేశంలో కొన్నింటిపై అపారమైన అపనమ్మకం.. వాటినే ఎంతో విలువనిస్తారు. ముఖ్యంగా కొన్ని శకునాలు బాగా విశ్వసిస్తారు. వాటిలో పిల్లి ఎదురురావడం అశుభంగా పరిగణిస్తారు. అదే విదేశాల్లో మాత్రం అందుకు విరుద్దంగా..
Black Cat as a Blessing: మన దేశంలో కొన్నింటిపై అపారమైన అపనమ్మకం.. వాటినే ఎంతో విలువనిస్తారు. ముఖ్యంగా కొన్ని శకునాలు బాగా విశ్వసిస్తారు. వాటిలో పిల్లి ఎదురురావడం అశుభంగా పరిగణిస్తారు. అందులోనూ నల్ల పిల్లి ఎదురువచ్చిందంటే చాలా ఇక అంతే.. కాసేపు ఆగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అదే కొన్ని దేశాల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి అక్కడి వారి నమ్మకాలు. ఇతర ప్రసిద్ధ సంస్కృతులలో నల్ల పిల్లులను శుభప్రదంగా పరిగణిస్తారు. సంతానోత్పత్తి, ప్రేమ, శ్రేయస్సును అందించేవిగా పరిగణించబడుతున్నాయని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు నమ్మకం కుదరడం లేదుగా..? నల్ల పిల్లులను ఏ దేశాలు అధిక ప్రధాన్యత ఇస్తున్నాయో తెలుసుకోవడానికి చదవండి.
యునైటెడ్ కింగ్డమ్
పెళ్లి రోజున వధువుకు నల్ల పిల్లిని బహుమతిగా ఇవ్వడం అదృష్టంగా భావిస్తురు యూకే జనం. కొత్తగా పెళ్లయిన వారి ఇంట్లో పిల్లి ఉంటే అది చెడును దూరం చేస్తుందని నమ్ముతారు. పిల్లి నలుపు రంగు అయితే మరింత అదృష్టం అని.. అక్కడివారికి ఆ రంగు అంటే అంత పిచ్చి అని మీకు తెలుసా?
జపాన్..
నలుపు లేదా స్వచ్ఛమైన తెల్లని పిల్లులు తమ ఇళ్లకు వస్తే శ్రేయస్సు , అదృష్టాన్ని తెస్తాయని జపాన్ వాసులు నమ్ముతారు. జపనీయుల నమ్మకం ప్రకారం నల్ల పిల్లులు చెడుతోపాటు శత్రువులను దూరం చేస్తాయని కూడా విశ్వస్తారు.
ఫ్రాన్స్
ప్రాన్స్‌లో నల్ల పిల్లులను మాగోట్స్ అని పిలుస్తారు. ఫ్రాన్స్‌లోని నమ్మకాల ప్రకారం.. అక్కడివారు నల్ల పిల్లికి సరిగ్గా ఆహారం ఇస్తే ఆ రోజు అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటారు.
స్కాట్లాండ్
నలుపు లేదా ఏదైనా రంగు పిల్లి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సంపద త్వరలో తలుపు తడుతుందని స్కాటిష్‌ల భారీ నమ్మకం. ఇందు కోసం వారు గృహ ప్రవేశాల రోజు తమ ఇంటికి పిల్లి రావాలని కోరుకుంటారు.
నార్వే
నల్ల పిల్లులు ప్రేమకు చిహ్నాలు. అవి సంతానోత్పత్తిని పెంచుతాయని నార్వేజియన్ పురాణాలు చెబుతున్నాయి. కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. నల్ల పిల్లులు ప్రేమ, సంతానోత్పత్తి దేవత అని వారు కొలిచే, ఆరాధించే దేవుడి ఫ్రీజా రథాన్ని అవి లాగుతాయని అనుకుంటారు.
ఈజిప్ట్
ఈజిప్టులో నల్ల పిల్లులను దేవతలుగా పూజిస్తారు. వాటిని మనోహరంగా ఆప్యాయతతో తెలివైనవిగా నమ్ముతారు. నిజానికి ఆ కుటుంబంలో నల్ల పిల్లి చనిపోతే ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోతుంది.
ఇవి కూడా చదవండి: Jawad Cyclone Live: జెట్ స్పీడ్‌తో దూసుకొస్తున్న జొవాద్.. సుడులు తిరుగుతూ విశాఖ తీరం వైపు..
Health Tips : కాలీఫ్లవర్ తెగ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..