Jawad Cyclone: తుఫాన్‌లకు పేర్లు ఎవరు పెడతారు.! ఇంతకీ ‘జొవాద్’ అర్థం ఏంటో తెలుసా?
గతకొన్ని రోజుల క్రితం వచ్చిన తుపాన్ కారణంగా రాయలసీమ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా...
గతకొన్ని రోజుల క్రితం వచ్చిన తుపాన్ కారణంగా రాయలసీమ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు జొవాద్ తుపాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. ఈ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్రకు పెను ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుపాన్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ప్రతిసారి కొత్తగా వచ్చే తుఫానుకు ఒక పేరుతో పిలుస్తుంటారు. లైలా, హుద్ హూద్, తిత్లీ, ఫణి ఇలా రకరకాల పేర్లను తుఫాన్లకు పెడుతుంటారు. ఇక తాజాగా జొవాద్ అనే పేరుకు కూడా ఓ హిస్టరీ ఉంది.
ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? బంగాళఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌కు జొవాద్ అనే పేరును సౌదీ అరేబియా దేశం తీసుకున్నారు. జవాద్ అంటే అరబిక్ భాషలో ఉదారమైన లేదా దయగల అనే అర్థాలు వస్తాయి. ఇంతకుముందు తుఫాన్లు తరహాలో విపరీతమైన గాలులతో విధ్వంసం సృష్టించకుండా జవాద్ పేరుకు తగినట్లే ఉదారంగా వ్యవహరిస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!