Coral Reefs: మనుషుల శవాలతో సముద్రం అడుగున పగడపు దిబ్బల ఏర్పాటు.. కాన్సెప్ట్ సూపర్ అంటున్న నెటిజన్లు

Coral Reefs: హిందూ పురాణాల ప్రకారం సముద్రం లోపల కూడా అద్భుతమైన నగరం ఉంది.. అందులో అందమైన లోకం ఉంటుంది.. దానికి రాజు సముద్రుడు.. అయితే ఇవన్నీ కథలు. ఇప్పుడు సముద్రాల అడుగున మరో అందమైన..

Coral Reefs: మనుషుల శవాలతో సముద్రం అడుగున పగడపు దిబ్బల ఏర్పాటు.. కాన్సెప్ట్ సూపర్ అంటున్న నెటిజన్లు
Coral Reefs
Follow us

|

Updated on: Mar 30, 2022 | 3:26 PM

Coral Reefs: హిందూ పురాణాల ప్రకారం సముద్రం లోపల కూడా అద్భుతమైన నగరం ఉంది.. అందులో అందమైన లోకం ఉంటుంది.. దానికి రాజు సముద్రుడు.. అయితే ఇవన్నీ కథలు. ఇప్పుడు సముద్రాల అడుగున మరో అందమైన లోకాన్ని సృష్టిస్తున్నాడు మనిషి తన మేధస్సుతో.. మీరేప్పుడైనా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లగలిగితే ఆ అద్భుత లోకాన్ని తప్పక చూసిరండి..ఎందుకంటే..ఆ పగడపు దీవుల్నీ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు..ఎంతో అందంగా రంగురంగుల‌తో ఈ కోర‌ల్ రీఫ్స్‌ అంటే పగడపు దిబ్బలు ఉంటాయి.. చందమామ కథ(Chandamama stories) లో చదివా పగడపు దీవులుంటాయని అనే పాటలో పగడపు దిబ్బల ప్రస్థావన ఉంటుంది. రెక్కల గుర్రం ఎక్కేసి, పగడదీవుల అంచుకి హీరోయిన్‌ని తీసుకెళ్తానంటాడు హీరో..ఇక ఎప్పటికీ మనం అక్కడే ఉందమంటాడు..అంటే అంత అద్భుతమైనవి. సముద్రంలో స్వర్గం ఏదైనా ఉందా అంటే అది కోరల్ రీఫ్స్ అనుకోవచ్చు. అంత అందంగా ఉంటాయవి. కానీ, దురదృష్టవశాత్తు వచ్చే మరికొన్నేళ్లలో ఇవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ క్రమంలోనే వాటిని రక్షించేందుకు మళ్ళీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. మనిషి మనిషి  అస్థిపంజరాన్ని(Human Skeleton) కోరల్ రీఫ్స్‌గా మార్చాలని ఆలోచిస్తున్నారు.. అందుకు తగిన ప్లాన్ తో అమెరికా.. ఫ్లోరిడాలోని ఎటర్నల్ రీఫ్స్ కంపెనీ ముందుకొచ్చింది.  మరణం తర్వాత పనికి రాని మనిషి శవాలతో పగడపు దిబ్బల తయారీ చేయనుంది.

ఇలా పగడపు దీవుల తయారీకి చనిపోయిన మనిషి శవంలో మిగిలిన ఎముకల్ని పొడిలా చేసి… పర్యావరణానికి మేలు చేసే pH న్యూట్రల్ అనే కాంక్రీటుతో కలుపుతారు. కోరల్ రీఫ్ లాంటి గుండ్రటి ఆకారాలు..ఓ రకంగా కృత్రిమ రీఫ్‌ల వంటివి తయారు చేసి వాటిని సముద్రం లోపల ఉంచుతారట. ఇలాంటి ఒక్కో బాల్‌ మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తు, రెండు మీటర్ల వెడల్పు, 250 కేజీల నుంచి 18వందల కేజీల బరువు కలిగి ఉంటాయట. అలా పెట్టి ఆర్టిఫిషీయర్‌ రీఫ్‌లు ఏ శవానిదో తెలియటం కోసం…ప్రతీ కృత్రిమ రీఫ్‌ పైనా వేలి ముద్రలు, కంచుతో తయారుచేసిన జ్ఞాపికను ఉంచుతారట. వీటి పైన పొర కాస్త గరుకుగా ఉండటంతో..దానిపై సముద్ర మొక్కలు, ఆల్గే వంటివి పెరుగుతాయని అంటున్నారు. దీంతో చనిపోయిన వ్యక్తి అస్థిపంజరం… సముద్ర జీవులకు ఆవాసంగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ 3000 కృత్రిమ రీఫ్‌లను టెక్సాస్ నుంచి న్యూజెర్సీ మధ్య 25 లొకరేషన్లలో సముద్రంలో ఉంచిందట. అయితే రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. జనాభాకు అనుగుణంగా పెరగని భూమి.. దీంతో స్మశానాలను కూడా నివాసాలుగా ఆక్రమించుకుంటున్న నేపథ్యంలో ఇలా శవాలతో పగడపు దీవుల తయారీ కాన్సెప్ట్  సూపర్బ్ అంటున్నారు కొంతమంది నెటిజన్లు.

Also Read: కీళ్ల నొప్పుల ఉపశమనం కోసం సింపుల్ చిట్కాలు..

పూజగదిలో చిత్రపటాలను ఏ దిశలో ఉంచితే సుఖ,సంపద కలుగుతాయంటే (Web Story)

Viral Video: రోడ్డుమీద కొట్టుకున్న ఓ యువతి, ఇద్దరు యువకులు.. నెట్టింట్లో వీడియో వైరల్