Baby-Born: అప్పుడే పుట్టిన శిశువును చూసిన డార్టర్లు షాక్.. ఎందుకంటే..

శిశువు పుట్టిన వెంటనే చాలామంది తల్లితండ్రులు తమ బేబీ ఎంత చురుకుగా ఉందనేది పరిశీలిస్తారు. పుట్టిన వెంటనే శిశువు తన కళ్ళను కొద్దిగా తెరుస్తుంది.

Baby-Born: అప్పుడే పుట్టిన శిశువును చూసిన డార్టర్లు షాక్.. ఎందుకంటే..
Baby Born With Snow White H
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2021 | 7:52 PM

శిశువు పుట్టిన వెంటనే చాలామంది తల్లితండ్రులు తమ బేబీ ఎంత చురుకుగా ఉందనేది పరిశీలిస్తారు. పుట్టిన వెంటనే శిశువు తన కళ్ళను కొద్దిగా తెరుస్తుంది. ముఖాలు పరిశీలిస్తుంది. ప్రత్యేకించి తల్లితండ్రులవి. మీ బేబీ ధ్వనులకు స్పందిస్తుంది. తన ఇంద్రియాలు అన్నింటిని వాసన, స్పర్శలతో సహా ఉపయోగిస్తుంది. మీకు దగ్గరవుతుంది. పుట్టిన సమయంలో  కొంతమంది పిల్లలు తలపై మందంగా పొడవాటి వెంట్రుకలు కలిగి ఉంటారు. కొంతమంది పిల్లలు తక్కువ జుట్టుతో ఈ ప్రపంచంలోకి వస్తారు. కానీ మీరు ఎప్పుడైనా తెలుపు జుట్టుతో నవజాత శిశువును చూశారా? ఇలాంటి కేసు ఇంగ్లాండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓ ఆసుపత్రిలో నెరిసిన జుట్టుతో ఓ చిన్నారి పుట్టడం ఈరోజుల్లో చర్చనీయాంశంగా మారింది. దీని చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లల జుట్టును చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.

ఇలాంటి ఘటనే  ఇంగ్లాండ్‌లోని వోకింగ్‌హామ్‌లో జరిగింది. అక్టోబర్ 6 న ఆర్చీ స్టోన్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన తర్వాత ఆ శిశువును చూని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆర్చీ జన్మించినప్పుడు.. అతని తలపై మందపాటి జుట్టు ఉంది. కానీ ఈ వెంట్రుకలు నలుపు కాదు, మంచులా తెల్లగా ఉన్నాయి. అంటే 60 ఏళ్ల వయసువారికి వచ్చే తలవెంట్రుకలను తలపించాయి. ఈ సంఘటన తరువాత ఆసుపత్రిలోని నర్సులు, వైద్యులు చాలా ఆశ్చర్యపోయారు.

డెయిలీ మెయిల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం 34 ఏళ్ల గెమ్మా స్టోన్ ఆర్చీ తన అన్నయ్య, సోదరి జుట్టు కూడా పుట్టినప్పుడు తెల్లగా ఉందని తెలిపింది. కానీ ఆర్చీ అంతగా లేదు. ఆర్చీ జన్మించిన తర్వాత  అతను ఆసుపత్రిలో ఉన్నంత వరకు నర్సులు, వైద్యులు తనను చూడటానికి వచ్చేవారని జెమ్మా చెప్పింది.

తన ముగ్గురు పిల్లలు పుట్టిన సమయంలో కడుపులో మంట, ఆమ్లత్వం ఫిర్యాదులు ఉన్నాయని గెమ్మ చెప్పింది. అసిడిటీ కారణంగా బహుశా తన ముగ్గురు పిల్లల జుట్టు ప్రభావితమైందని .. వారు తెల్లగా మారారని జెమ్మా అభిప్రాయపడింది. గెమ్మ ప్రకారం, ఆమె తన పిల్లలతో ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు, అపరిచితులు ఆమె పిల్లల జుట్టును చూసి ఆశ్చర్యపోతారు. ఇటీవల గెమ్మా ఒక ఫంక్షన్‌కు వెళ్లింది, అక్కడ చాలా మంది తన బిడ్డను చూస్తున్నారు. అయితే, తరువాత ప్రజలు కూడా తెల్ల జుట్టును ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి: Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..

Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. ఐదేళ్ల క్రితం ధోని ఏం చెప్పాడో ఇప్పుడు అచ్చు అలాగే జరిగింది..