AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే ఆఫర్‌..చికెన్‌, లాలిపాప్స్‌ తింటే చాలు లక్ష జీతం.. ఎక్కడో తెలుసా..?

సాధారణంగా ముఖ్యమైన జాబ్‌లను సంపాదిస్తే లక్షల్లో జీతం ఉంటుంది. వ్యాపారాల ద్వారా కూడా లక్షల్లో సంపాదించవచ్చు. ఇక కొన్ని ఉద్యోగాలు ఆశ్చర్యకరంగా..

అదిరిపోయే ఆఫర్‌..చికెన్‌, లాలిపాప్స్‌ తింటే చాలు లక్ష జీతం.. ఎక్కడో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Oct 25, 2021 | 1:30 PM

Share

సాధారణంగా ముఖ్యమైన జాబ్‌లను సంపాదిస్తే లక్షల్లో జీతం ఉంటుంది. వ్యాపారాల ద్వారా కూడా లక్షల్లో సంపాదించవచ్చు. ఇక కొన్ని ఉద్యోగాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. సీసీ టీవీ చూస్తూ ఉంటే చాలు లక్షల్లో జీతం అని ప్రకటనలు చూస్తూనే ఉంటాము. యూకేలో మాత్రం ఓ ప్రకటన అందరిని ఆసక్తి కలిగించేలా ఉంది. ఇక చికెన్‌ అంటే అందరు లొట్టలేసుకుంటారు. యూకేలో ఓ ఫుడ్‌ కంపెనీ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. చికెన్‌, లాలిపాప్స్‌ తింటే లక్ష రూపాయల జీతం చెల్లిస్తామని ప్రకటన చేయడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఫిష్‌ ఫింగర్స్‌ కంపెనీ బర్డ్స్‌ ఐ తన ఉద్యోగ ప్రకటనతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ఇక్కడ చికెన్‌ లాలిపాప్స్‌తో టమోటా సాస్‌ కలయికను ప్రజలు అమితంగా ఇష్టపడుతుంటారని ఓ సర్వేలో తేలింది. అయితే ఈ కంపెనీ చికెన్‌, లాలిపాప్స్‌ తినేందుకు ఓ వ్యక్తి కావాలంటే ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఫుడ్‌ రుచిని మరింతగా మెరుగుపర్చేందుకు ఈ రకమైన వ్యక్తుల కోసం వెతుకుతోంది కంపెనీ.

ఈ ఉద్యోగం చికెన్‌, లాలిపాప్స్‌ తిని రుచి ఎలా ఉందో గుర్తించడమే. కంపెనీ టెస్టర్లను నియమించకోవడానికి ఇదే కారణం. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి చీఫ్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ పోస్టులో ఎంపిక చేస్తుంది. దీని కోసం లక్ష రూపాయల జీతం అందిస్తోంది.

ది సన్‌ వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం.. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఫుడ్‌పై పూర్తిగా అవగాహన ఉండాలి. మీరు ఆహార ప్రియులైతే రుచిపై మంచి పట్టుండాలి. ఉద్యోగం పొందడానికి వారు నిర్వహించిన పరీక్షలో 250 పదాల వరకు రాయాలి. ఉద్యోగానికి ఎందుకు ఎంపిక చేసుకోవాలో తెలుపాలి. ఈ అంశాలను birdseyeHR@chiefdippingofficer.co.uk కు రాసి కు పంపవచ్చు. తమ కంపెనీ తయారు చేసే చికెన్‌, లాలిపాప్స్‌ రుచిని చూసి చెప్పేందుకే ఈ ఉద్యోగ ప్రకటన చేసింది. అందులో లక్ష రూపాయల వరకు జీతం చెల్లిస్తుండటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Baby Born on Plane: విమాన ప్రయాణంలో జన్మించిన శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది..? ఆసక్తికర విషయాలు..!

Petrol Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!