Baby Born on Plane: విమాన ప్రయాణంలో జన్మించిన శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది..? ఆసక్తికర విషయాలు..!

Baby Born on Plane: సాధారణంగా బర్త్‌ సర్టిసర్టిఫికేట్‌ కావాలంటే ఎక్కడైతే జన్మిస్తారే అక్కడి అధికారుల నుంచి పుట్టిన తేదీ సర్టిఫికేట్‌ తీసుకుంటాము. లేదా ఆస్పత్రుల్లో..

Baby Born on Plane: విమాన ప్రయాణంలో జన్మించిన శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది..? ఆసక్తికర విషయాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 25, 2021 | 9:06 AM

Baby Born on Plane: సాధారణంగా బర్త్‌ సర్టిసర్టిఫికేట్‌ కావాలంటే ఎక్కడైతే జన్మిస్తారే అక్కడి అధికారుల నుంచి పుట్టిన తేదీ సర్టిఫికేట్‌ తీసుకుంటాము. లేదా ఆస్పత్రుల్లో, గ్రామ పంచాయతీల్లో, మీ సేవా కేంద్రాల ద్వారా ఈ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. అయితే బర్త్‌ సర్టిఫికేట్‌ కావాలంటే పుట్టిన ప్రదేశం, ఏ తేదీన జన్మించారు.. ఏ సమయానికి,తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరి కావాల్సి ఉంటుంది. అయితే ఏ దేశంలో పుడితే సర్టిఫికేట్‌ ఆధారంగా ఆ దేశ పౌరసత్వం పొందవచ్చు. అలాగే తల్లిదండ్రుల వారసత్వం, పూర్వీకులు, సుదీర్ఘ నివాసం మొదలైన కారణాలు ఆధారంగా వారసత్వం పొందవచ్చు. అయితే సాధారణంగా గతంలో తమతమ ఇళ్లల్లోనే ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. మరి విమానంలో జన్మించిన బిడ్డకు ఏ ప్రాంతం నుంచి బర్త్‌ సర్టిఫికేట్‌ పొందవద్దు. ఆకాశంలో గాల్లో ఎగిగే విమానంలో పుడితే సర్టిఫికేట్‌ను ఎలా జారీ చేస్తారు. విమానంలో జన్మించిన శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది.. ఇలాంటి అనుమానాలు కొందరికి రావచ్చు. బిడ్డ ఏ దేశంలో జన్మించాడో ఆ దేశ పౌరసత్వం లభిస్తుందనే విషయం తెలిసిందే. పుట్టిన సర్టిఫికేట్‌లో పుట్టిన ప్రాంతం పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. మరి ఆకాశంలో ఎగిరే విమానంలో బిడ్డ జన్మించినట్లయితే జనన ధృవీకరణలో పుట్టిన స్థలం ఏం రాయాల్సి ఉంటుంది.

సాధారణంగా గర్భిణీ స్త్రీలు 9వ నెలలో ప్రయాణం చేయకుండా ఉంటారు. ఈ గర్భిణీ సమయంలో ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచిస్తుంటారు. అయితే నిబంధనల ప్రకారం.. 7 నెలలు లేదా అంతకన్న ఎక్కువ నెలుల నిండిన గర్భిణులు భారతదేశంలో విమానంలో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. కానీ అత్యవసరమైన పరిస్థితులను బట్టి మాత్రమే అనుమతి ఉంటుంది. 7 నెలల తర్వాత విమానం ప్రయాణం చేయాలంటే అందుకు కారణాలను చూపెట్టి విమాన ప్రయాణానికి అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకే భారత్‌ నుంచి అమెరికా వెళ్తున్నప్పుడు ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ జన్మస్థలం ఏ ప్రాంతం ఉంటుంది. ఇది పెద్ద ప్రశ్నే.

విమానంలో ప్రయాణించే గర్భిణులు బిడ్డకు జన్మనిచ్చినట్లయితే ముందుగా సరిహద్దులను చూడాల్సి ఉంటుందని ఎయిర్‌ఫోర్ట్‌ అథారిటీ అధికారులు చెబుతున్నారు. విమానంలో బిడ్డ జన్మించిందంటే ఆ బిడ్డ పుట్టే సమయంలో ఏ దేశ సరిహద్దులో విమానం ప్రయాణించిందో విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సంబంధిత దేశంలోని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. పిల్లల జనన ధృవీకరణ పత్రంలో ఆ దేశం పేరును నమోదు చేయబడుతుంది. అలాంటి సమయంలో ఆ బిడ్డ ఆ దేశం పౌరసత్వం పొందవచ్చు. అలాగే తల్లిదండ్రులు నివసిస్తున్న దేశం పౌరసత్వం కూడా పొందే హక్కు ఉంటుంది.

ఉదాహరణకు.. శ్రీలంక నుంచి అమెరికా వెళ్లే విమానంలో భారత సరిహద్దు మీదుగా వెళుతోందని అనుకుందాం. ఆ సమయంలో శ్రీలంక మహిళ విమానంలో ఓ బిడ్డకు జన్మినిచ్చిందనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో పిల్లల జన్మస్థలం భారతదేశంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా విమానంలో పుట్టిన బిడ్డకు భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే తల్లిదండ్రులది శ్రీలంక కావడం వల్ల ఆ బిడ్డకు శ్రీలంక పౌరసత్వం పొందే హక్కు ఉంటుంది.

ఇలా జరిగితే.. నివేదికల ప్రకారం.. కొన్నేళ్ల కిందట ఇలా కేసు అమెరికాలో చోటు చేసుకుంది. నెదర్లాండ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి ఒక విమానం అమెరికాకు బయలుదేరింది. విమానం అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా వెళ్తుండగా, విమానంలో ఉన్న ఓ మహిళ పురిటి నొప్పులు వచ్చాయి. విమానంలోనే ఆ మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆనారోగ్యంగా ఉండటంతో యూఎస్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాంటి సమయంలో బిడ్డ ఆమెరికా సరిహద్దులో పుట్టడంతో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. దీంతో పాటు బిడ్డ తల్లిదండ్రులు నెదర్లాండ్‌కు చెందిన వారు కావడంతో రెండు దేశాల పౌరసత్వం కూడా ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Indian Railways: రైలు బోగీలలో రెస్టారెంట్‌.. కళ్లు చెదిరే లైటింగ్.. అదిరిపోయే పెయింటింగ్స్.. ఎక్కడో తెలుసా..?

Bank Loan: ఈ బ్యాంకులో హోమ్‌ లోన్‌ తీసుకునే వారికి అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ వడ్డీ, ఇతర ఫీజుల మినహాయింపు..!