Gurivinda Ginjalu: పేనుకొరుకుడుకి, ఒత్తుగా జుట్టు పెరగాలంటే.. ఈ గురివింద ఆకులు దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే
Abrus Precatorius: గురువింద గింజ ఎక్కువగా సామెత రూపంలో దీని గురించి వింటూ వుంటారు. తీగ జాతి మొక్క.. పల్లెల్లో అయితే వీటిని...
Gurivinda Ginjalu: గురువింద గింజ ఎక్కువగా సామెత రూపంలో దీని గురించి వింటూ వుంటారు. తీగ జాతి మొక్క.. పల్లెల్లో అయితే వీటిని చెట్లకు చుట్టుకుని కనిపిస్తాయి. ఈ గురివింద గింజలను లక్ష్మి స్వరూపంగా కొలుస్తారు. పూర్వం బంగారాన్ని గురువింద గింజలతో తూకం వేసేవారు. ఇవి ఆకుపచ్చ, పసుపు, తెలుగు, నలుపు రకాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఎరుపు రంగు గురివింద గింజలను చూస్తుంటారు.. మిగిలిన రంగులు అరుదుగా కనిపిస్తాయి. ఈ చెట్టు గింజలు విషపూరితం.. కనుక వీటిని పై పొట్టు తీసి ఉపయోగిస్తారు. ఇక తమిళ సిద్ధులు అయితే పాలల్లో గురివింద గింజలను మరించి తరువాత అధిక ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు దానిలో ఉన్న విష లక్షణాలు కోల్పోయే విధంగా చేసి ఉపయోగించేవారు. ఇక ఈ చెట్టు ఆకులు, కాండంలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గురివింద గింజలు, ఆకులు, వేర్లు సాంప్రదాయ ఔషధంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇక ఆయుర్వేదంలో ఈ గింజలలోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడుతున్నారు. ఈరోజు గురివింద ఆకులు చేసే మేలు గురించి గురించి తెలుసుకుందాం..
* పేనుకొరుకుడుకి పొట్టు తీసిన గురువింద గింజలు మంచి మెడిసిన్. ముందుగా గురువింద గింజల పై ఉన్న పొట్టును తీసి అరగ తీయాలి. అందులో నువ్వుల నూనె కలిపి పేనుకొరుకుడు ఉన్న ప్రాంతంలో రెగ్యులర్ గా అప్లై చేస్తే.. వెంట్రుకలు తిరుగు మొలుస్తాయి. *జుట్టు రాలుతూ ఇబ్బంది పడుతుంటే.. గురివింద ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో పోసుకొని నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి కోవాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ప్రతిరోజూ ఆ నూనెను రోజూ తలకు రాసుకుంటే.. జుట్టు రాలడం తగ్గి.. జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. * చెవిపోటుతో ఇబ్బంది పడుతుంటే.. గురువింద ఆకుల రసాన్ని తీసి రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి తగ్గుతుంది. *దగ్గుతో ఇబ్బంది పడుతుంటే గురివింద గింజల ఆకుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది. *బొంగురు గొంతుతో ఇబ్బంది పడుతుంటే ఈ ఆకులు నమిలితే మంచి కంఠస్వరం వస్తుంది. *ఈ ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి *చర్మం పై తెల్లని మచ్చలుంటే.. ఈ ఆకుల రసాన్ని తీసుకుని ఆ మచ్చలపై రాసుకుని ఒక 15 నిమిషాల పాటు ఎండలో నిలబడి.. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు రెగ్యులర్ గా అప్లై చేయాలి *గురివింద గింజల తో వేసే పొగ మన ఇంట్లో దోమలు పోతాయి. వారంలో రెండు రోజులు ఈ పొగ వేయడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా దోమలు గుడ్లు పెట్టకుండా చేస్తుంది. *ఇక గురువింద గింజలను గ్రహ దోషాల నివారణకు నర దిష్టి తగలకుండా కూడా ఉపయోగిస్తారు.
Also Read: యూపీలో వెలుగులోకి వచ్చిన జికా వైరస్.. మొదటి కేసు నమోదు.. అప్రమత్తమమైన అధికారులు..