AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెల్లో మంటగా ఉంటుందా ? అయితే వీటిని అస్సలు తినవద్దు.. అవేంటంటే..

మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. చిన్న.. పెద్ద తేడా లేకుండా గుండెల్లో

గుండెల్లో మంటగా ఉంటుందా ? అయితే వీటిని అస్సలు తినవద్దు.. అవేంటంటే..
Heartburn
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2021 | 8:56 AM

Share

మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. చిన్న.. పెద్ద తేడా లేకుండా గుండెల్లో మంట.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహరం వలన కూడా గుండెల్లో మంట కలుగుతుంది. ఇక తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయిన గుండెలో మంట వస్తుంది.. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్న గుండెలో ఏర్పడుతుంది. అవెంటో ఇప్పుడు తెలుకుందామా.

నూనెలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఇవి తొందరంగా జీర్ణం కావు.. ముఖ్యం బయట దొరికే బజ్జీలు, మిర్చిలు వంటివి జీర్ణక్రియకు హాని కలిగిస్తాయి. అలాగే మసాల వాడకాన్ని తగ్గించాలి. పచ్చి మిరపకాయలు.. మిరియాలు ఉపయోగించడం పూర్తిగా తగ్గించాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగానే ఉంటాయి… కానీ అవి అజీర్ణం కలిగిస్తాయి. అంతేకాకుండా.. గుండెలో మంటకు కారణమవుతాయి. లాక్టోజ్ అనేది పాలలో ఉండే ఒక రకమైన షుగర్. లాక్టోజ్ జీర్ణం చేయగల ఎంజైములు పెద్దవారిలో తక్కువగ ఉండడం వలన గుండెలో మంటను కలిగిస్తోంది. క్యాబేజి… బ్రకోలి.. ముల్లంగి వంటివి త్వరగా జీర్ణం కావు.. వీటిలో అలిగో శాచురైడ్స్ అనే పదార్థం ఉంటుంది. వీటిని జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్ మానువులలో ఉండదు. అందుకే ఇవి త్వరగా జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్లి గ్యాస్ సమస్యను కలిగిస్తాయి.

రాగి, రాగి రొట్టెలు… అంబలిలో కాల్షియం.. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపులో బరువుగా ఉంటుంది. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫలితంగా గుండె మంట కలుగుతుంది. సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహారం గొట్టం కణాలను ఇబ్బంది పెట్టి ఆహారం బయటకు వచ్చేలా చేస్తాయి. వీటిని ఖాళీ పొట్టతో తీసుకోవద్దు. పప్పులు, రాజ్మా, బీన్స్ వంటి పదార్థాలలో అలిగో శాచురేట్స్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి త్వరగా జీర్ణం కావు.

Also Read: ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్..

Rajababu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు రాజబాబు కన్నుమూత..

Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..