AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..

బిగ్‏బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హౌస్‏లోకి వెళ్లక ముందు పాపులారిటీ ఉన్నవాళ్లు..

Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2021 | 7:04 AM

Share

బిగ్‏బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హౌస్‏లోకి వెళ్లక ముందు పాపులారిటీ ఉన్నవాళ్లు.. తమ ప్రవర్తనతో నెగిటివ్‏గా మారిపోవచ్చు.. ఎలాంటి గుర్తింపు లేనివాళ్లు హీరోలుగా మారిపోవచ్చు. అయితే వారం వారం కంటెస్టెంట్స్ స్వభావాలు.. ప్రవర్తన బట్టి ఆడియన్స్ వారికి మద్దతు ఇచ్చే విధానం మారుతుంది. అయితే ఇక కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు కూడా ఓటింగ్ పై ప్రభావం చూపిస్తాయి. నటి ప్రియ విషయంలోనూ అదే జరిగింది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్‏లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి ఏడోవారం ఎలిమినేట్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రియ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు మిగిలిన హౌస్ మేట్స్. అందులోనూ… సన్నీతో పదే పదే గొడవ పెట్టుకుంటూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వచ్చింది ప్రియా..

ఇక రవి.. లహరి గొడవలో తప్పు రవిది అని రుజువు కావడంతో ప్రియకు మద్దతు భారీగా పెరిగిపోయింది. ప్రతివారం నామినేట్ అవుతున్నా.. తనను ఎలిమినేట్ కాకుండా కాపాడుతూ వచ్చారు ఆడియన్స్. అయితే మొన్నటి ఎపిసోడ్‏లో ప్రియ ప్రవర్తనే ఆమె కొంపముంచింది. సన్నీతో ప్రతి సారి గొడవ పడడం సాధారణంగానే అనిపించిన.. మొన్నటి ఎపిసోడ్‏లో మాత్రం ప్రియ శ్రుతిమించి ప్రవర్తించింది. దీంతో ప్రేక్షకులకు విసుగు కలిగిలా చేసింది. బంగారు కోడి పెట్ట అనే టాస్కులో సన్నీని టార్గెట్ చేసింది ప్రియ. ప్రతి సారి అతని గుడ్లను దొంగిలిస్తూ.. కావాలనే అతన్ని రెచ్చగొట్టింది. నువ్వు మగాడివే కాదు.. నా ముందు మాట్లాడు.. నేను నీ గుడ్లనే దొంగిలిస్తాను.. ఏం చేసుకుంటావో చేసుకో… నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను అంటూ దారుణంగా రెచ్చగొట్టింది. ఇక అదే టాస్కులో పిచ్చిగా నవ్వడం.. సన్నీని రెచ్చగొడుతూ మాట్లాడటం చేసింది. దీంతో ప్రియ ప్రవర్తన చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.. ఇనాళ్లు ముక్కుసూటిగా మాట్లాడుతూ గేమ్ ఆడిన ప్రియ ప్రవర్తనకు ఆమెకు ఓట్లు వేయడం తగ్గించేశారు… దీంతో డేంజర్ జోన్‏లో ఉన్న యానీ మాస్టర్ కాకుండా… ప్రియ ఎలిమినేట్ అయ్యింది. మొత్తానికి ఒక్కరోజు ఎపిసోడ్‏లో ప్రియ శ్రుతిమించిన ప్రవర్తన ఆమెను హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది.

Also Read: RRR Update: ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్‌ వచ్చేది అప్పుడేనా.? ఈ నెలలోనే..

Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..