Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. సమంత ఒంటరిగానే బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది.. విడాకుల ప్రకటన అనంతరం..

Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2021 | 9:51 PM

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. సమంత ఒంటరిగానే బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది.. విడాకుల ప్రకటన అనంతరం.. సోషల్ మీడియాలో సామ్ పై చెడు ప్రచారం జరిగింది.. సామ్ బిహేవియర్.. తన వ్యక్తిత్వం పై ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు నెటిజన్స్.. నిజానికి నాగచైతన్య.. సమంత విడాకులు తీసుకోవడానికి సరైన కారణమేంటో తెలియకపోయిన తప్పు సమంతదే అని డిసైడ్ చేశారు ప్రేక్షకుల.. దీంతో తనను మరింత బాధపెట్టవద్దని.. తనపై వస్తున్న రూమర్స్ అన్ని అసత్యమేనని వివరణ ఇచ్చుకుంది సామ్.. ప్రస్తుత కఠినమైన పరిస్థితుల నుంచి తను కోలుకోవడానికి కాస్త సమయం కావాలంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సమంత నెట్టింట్లో యాక్టివ్‏గా ఉంటుంది. ప్రస్తుతం సామ్.. తన స్నేహితులరాలు … ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత..

అయితే విడాకుల ప్రకటన కంటే ముందు నుంచే సమంత మై మమ్మా సెడ్ అనే హ్యాష్ ట్యాగ్‍తో కొన్ని పోస్టులు చేస్తూ వస్తుంది. గతంలో సామ్ చేసిన పోస్టులై నెట్టింట్లో పెద్ద చర్చే జరిగింది. తాజాగా మరోసారి మై మమ్మా సెడ్ అంటూ మరో ఆసక్తికర పోస్ట్ చేసింది సమంత. “ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి” అంటూ తన ఇన్‏స్టాలో పోస్ట్ చేసింది సామ్.

Sam

Sam

ఇక విడాకుల ప్రకటన అనంతరం సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. తనకు నచ్చిన ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇటీవల రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా టాక్. త్వరలోనే షూటింగ్‏లో పాల్గోనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మళ్లీ నిరాశేనా.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారిపోయిందా ?

Manchu Vishnu: హద్దులు మీరుతున్నారు… అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..