Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మళ్లీ నిరాశేనా.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారిపోయిందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా..

Sarkaru Vaari Paata: మహేష్  ఫ్యాన్స్‏కు మళ్లీ నిరాశేనా.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారిపోయిందా ?
Sarkaru Vaari Paata
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2021 | 7:55 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై అంచనాలను భారీగానే పెంచేశాయి. అంతేకాకుండా.. మహేష్… ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించడంతో అభిమానులు సర్కారు వారి పాట మూవీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి పండగ సందర్భంగా ఈ మూవీని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

అయితే.. ఇప్పుడు సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మహేష్ సినిమాకు జక్కన్న అడ్డుకట్ట వేసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్.. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జనవరి 7న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు జక్కన్న. ఎంతో ప్రతిష్టా్త్మకంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. భారీ అంచనాల మధ్య వస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు.. కనీసం మూడు వారాల గ్యాప్ ఉండాలని ఆలోచిస్తున్నారట మేకర్స్. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటించిన సినిమాకు పోటీగా మరో మూవీ వస్తే.. కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం ఉండబోతుందోనని సర్కారు వారి పాట మేకర్స్ ఆలోచిస్తున్నారట. దీంతో మహేష్ సినిమాను వేసవికి వాయిదా వేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సర్కారు వారి పాట చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటున్నారట్లుగా టాక్. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే సంక్రాంతి బరిలో నుంచి మహేష్ తప్పుకున్నట్లైతే.. అభిమానులకు నిరాశే.. ప్రస్తుతం సర్కారు వారి పాట స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Manchu Vishnu: హద్దులు మీరుతున్నారు… అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..

Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్