AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్..
Ntr
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2021 | 8:28 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించనున్నాడు. ఇందులో భాగంగా.. తారక్ ముందుగా.. కొరటాల శివ దర్శకత్వం ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్ధరి కలయికలో రాబోతున్న సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించేందుకు కసరత్తలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై అభిమానులు అంచనాలు భారీగానే పెట్టుకున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్ వర్క్ పూర్తైందని సమాచరం. జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే ఈ సినిమా సెట్ నిర్మిస్తున్నట్లుగా కొరటాల శివ తెలిపారు. ఇక ప్రస్తుతం తారక్‏కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని స్క్రీప్టులో కొన్ని కీలక మార్పులు చేశాడట. ఇక ఇప్పుడు స్క్రీప్ట్ వర్క్ పూర్తయిందని.. ఎన్టీఆర్ ఫుల్ స్క్రిప్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‏గా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలియా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‏కు జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..

RRR Update: ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్‌ వచ్చేది అప్పుడేనా.?

Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..