AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zika Virus: యూపీలో వెలుగులోకి వచ్చిన జికా వైరస్.. మొదటి కేసు నమోదు.. అప్రమత్తమమైన అధికారులు

Zika Virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.  అయితే మరోవైపు  జికా వైరస్‌ దేశంలో మెల్లగా..

Zika Virus: యూపీలో వెలుగులోకి వచ్చిన జికా వైరస్.. మొదటి కేసు నమోదు.. అప్రమత్తమమైన అధికారులు
Zika Virus
Surya Kala
|

Updated on: Oct 25, 2021 | 8:22 AM

Share

Zika Virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.  అయితే మరోవైపు  జికా వైరస్‌ దేశంలో మెల్లగా విస్తరిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చి  ఆందోళన కలిగిస్తుంది.  ఉత్తరప్రదేశ్‌లోని  కాన్పూర్‌లో మొదటి జికా వైరస్ నమోదైందని ఆరోగ్య అధికారి తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లోని ఒక వారెంట్ ఆఫీసర్ కు శనివారం జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని.. ఇది కాన్పూర్‌లో మొదటి కేసు అని ఆ అధికారి తెలిపారు.

కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేపాల్ సింగ్ మాట్లాడుతూ..  IAF అధికారి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం జిల్లాలోని ఎయిర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.  ఆఫీసర్ లక్షణాలను జికా వైరస్ గా అనుమానించిన వైద్య నిపుణులు పరీక్షల నిమిత్తం రక్త నమూనాను సేకరించి పూణేకు పంపారు. ల్యాబ్ రిపోర్ట్స్ లో రోగికి జికా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో అధికారి తిరిగిన పరిసర ప్రాంతాలను మునిసిపల్ కార్పొరేషన్ శుభ్రపరిచింది. అంతేకాదు రోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించారు. అంతేకాదు అదే లక్షణాలు ఉన్న మరో ఇరవై రెండు మంది నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించామని సింగ్ తెలిపారు. దీంతో తాజా పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అంతే కాదు జిల్లాలో వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి అధికారులు పలు బృందాలను నియమించారు.

మొదటిసారిగా 

దేశంలో ఉత్తర్ ప్రదేశ్ కంటే ముందు కేరళ, మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జికా వైరస్‌ ఏడిస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. జికా వైరస్‌ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు.

జికా వైరస్ లక్షణాలు: 

జికావైరస్‌ సోకిన వారికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిస్తాయి. అయితే.. ఈ వైరస్‌ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం అంతటా ఆందోళన కలిగిస్తోంది. అయితే.. పిల్లలకు సోకితే ఈ వైరస్ వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది లైంగిక సంపర్కం ద్వారా కూడా సంక్రమిస్తుంది.

Also Read:  మూర్ఖుడితో.. అతిగా పొగిడేవారితో సహవాసం వద్దని.. సక్సెస్ సూత్రాలు చెప్పిన చాణిక్య..