AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajababu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు రాజబాబు కన్నుమూత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు మృతి చెందారు..

Rajababu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు రాజబాబు కన్నుమూత..
Rajababu
Rajitha Chanti
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 25, 2021 | 5:15 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు మృతి చెందారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 64 సంవత్సరాలు. తెలుగు సినిమా, టీవీ , రంగస్థలంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రాజబాబుకు భార్య.. ఇద్దరు అబ్బాయిలు.. ఒక అమ్మాయి ఉన్నారు.

రాజబాబు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేటలో 13 జూన్ 1957లో జన్మించారు. ఆయన తండ్రి పేరు రామతారకం. ఆయన చిత్ర నిర్మాత నటుడు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “, “రాధమ్మ పెళ్లి ” సినిమాలను నిర్మించారు . కాకినాడలో స్థిరపడిన రాజబాబుకు వ్యవసాయం చెయడం..కబడ్డి ఆడడం, రంగస్థలం మీద నటించడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును1995లో “ఊరికి మొనగాడు ” అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు. సిందూరం సినిమా తరువాత రాజబాబును అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కాకినాడ నుంచి రాజబాబు హైదరాబాద్ కు మకాం మార్చి సినిమా రంగంపై దృష్టి పెట్టారు. ఆనతి కాలంలోనే రాజబాబు, సముద్రం ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సముద్రం , కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా ?, శ్రీకారం , బ్రమ్మోత్సవం, భరత్ అనే మొదలైన 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.

సినిమాతో పాటు టీవీ రంగంలో కూడా రాజబాబు నటించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి, ప్రియాంక సీరియల్స్‏ లో పోషించిన పాత్రలు రాజబాబుకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. రాజబాబు 48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు . 2005వ సంవత్సరంలో “అమ్మ ” సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. రాజబాబును కాకినాడలో ఘనంగా సత్కరించారు . సినిమా రంగంలోనూ , టీవీ రంగంలోనూ రాజబాబుకు ఎంతో మంది స్నేహితులు , ఆత్మీయులు వున్నారు . తెలుగు తనాన్ని తెరమీద పంచి తెర మెరుగైన రాజబాబు ఎప్పటికీ తన పాత్రల ద్వారా చిరంజీవిగా వుంటారు.