Winter: శీతాకాలం వచ్చేసింది.. ఎలర్జీలు పెరిగే సమయం ఇది.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది
శీతాకాలం వచ్చేసింది. ఇక ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండవచ్చు.
Winter: శీతాకాలం వచ్చేసింది. ఇక ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండవచ్చు. సాధారణంగా శీతాకాలంలో అలెర్జీ కేసులు 70% వరకు పెరుగుతాయి. ఒక వ్యక్తికి అలెర్జీ కారకాలతో పరిచయం ఏర్పడినప్పుడల్లా, శరీరం రక్తంలోకి హిస్టమిన్ రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది తుమ్ములు, దగ్గు, తలనొప్పికి కారణమవుతుంది. అటువంటి రోగులకు చికిత్సగా ఇమ్యునోథెరపీ ఇస్తారు.
కొన్ని జాగ్రత్తల తో శీతాకాలంలో వచ్చే ఇటువంటి ఎలార్జీలను నివారించవచ్చు. అదేవిధంగా ఇమ్యునోథెరపీతో అలర్జీలను నయం చేయవచ్చు. నిపుణులు శీతాకాలంలో వచ్చే ఎలర్జీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అవి ఏమిటో తెలుసుకుందాం.
దుమ్ము, పొగ వల్ల కలిగే అలర్జీలను నివారించడానికి మూడు మార్గాలు..
ఏదైనా దుమ్ము ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయాల్సి వచ్చినపుడు పొడి బట్టకు బదులుగా తడి బట్ట వాడండి. దీని ద్వారా దుమ్ము తడి గుడ్డకు అటుక్కుంటుంది. దీనివలన దుమ్ము కణాలు గాలిలోకి చేరడం తరువాత అవి మనకు ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి చేరడం తగ్గుతాయి. 54 డిగ్రీల సి. వేడి నీటిలో బట్టలు ఉతకండి: దుస్తులు నుండి దుమ్ము పురుగులను తొలగించడానికి కనీసం 54 ° C వేడిగా ఉండే నీటిలో కడగాలి. మాస్క్ ధరించండి. N-95 లేదా FFP2 ముసుగు 0.1 నుండి 0.3 మైక్రోన్ రేణువులను కూడా ఫిల్టర్ చేయగలదు. ఈ కణాలు మానవ జుట్టు కంటే 700 రెట్లు చిన్నవి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి
- మీకు ముక్కు కారడం, కళ్లలో నీరు కారడం లేదా చాలా రోజుల పాటు నిరంతర దగ్గు ఉంటే.
- ఈ లక్షణాల వల్ల నిద్ర పట్టక పోతే అప్రమత్తంగా ఉండాలి.
- మీకు సైనస్ ఇన్ఫెక్షన్, తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉంటే.
- అలెర్జీకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే మీకు తోచిన మందులు వాడకూడదు. వెంటనే వైద్య సలహా తీసుకోండి.
ఇవి కూడా చదవండి: PM Modi: వారణాసి పర్యటనకు నరేంద్ర మోడీ.. 64 కోట్లతో ప్రజారోగ్యం కోసం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్‌కు శ్రీకారం చుట్టనున్న ప్రధాని!
Snow Fall: మూడు అడుగుల మేర కురిసిన మంచు..అటల్ టన్నెల్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు!