Health: ఛాతిలో నొప్పిగా అనిపిస్తుందా.? అది గ్యాస్ కారణంగా వచ్చిందా.. గుండె సమస్యతో వచ్చిందా.. ఇలా తెలుసుకోండి..
Health: సాధారణంగా మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఛాతిలో నొప్పితో బాధపడే ఉంటాం. ఆహారం జీర్ణం కాకపోయినా, పుల్లటి ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే..
Health: సాధారణంగా మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఛాతిలో నొప్పితో బాధపడే ఉంటాం. ఆహారం జీర్ణం కాకపోయినా, పుల్లటి ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే ఛాతిలో నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఛాతిలో నొప్పి రావడానికి ప్రధాన కారణం గ్యాస్ అని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యల వల్ల కూడా ఛాతిలో నొప్పి కలుగుతుంది. హృదయ సంబంధిత రోగాలను ముందుగా ఛాతి నొప్పి ద్వారా గుర్తించవచ్చని నిపుణులు కూడా సూచిస్తుంటారు. మరి ఇంతకీ మనకు ఛాతిలో వచ్చిన నొప్పి గ్యాస్ కారణంగానా.? లేదా గుండె వ్యాధికి సంబంధించా.? కొన్ని సింపుల్ టిప్స్‌తో తెలుసుకోవచ్చు. ఇంతకీ అవేంటే..
గ్యాస్ వల్ల కలిగే ఛాతి నొప్పి లక్షణాలు..
గ్యాస్ వల్ల ఇబ్బంది పడితే ఛాతిలో ఎడమవైపు నొప్పిగా ఉంటుంది. అలాగే ఇలాంటి వారిలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇక గ్యాస్ వల్ల పుల్లని త్రేన్పులు ఎక్కువగా విస్తుంటాయి. కడుపులో మంటగా ఉంటుంది. గుండెల్లో మండుతున్నట్లు భావన కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది గ్యాస్ వల్ల వచ్చిన నొప్పిగా భావించాలి.
గుండె సంబంధిత వ్యాధులు ఉంటే కనిపించే లక్షణాలు..
హృదయ సంబంధిత వ్యాధుల్లో కూడా ఛాతిలో నొప్పి లక్షణం కనిపిస్తుంది. అయితే దీంతో పాటు కనిపించే మరికొన్ని లక్షణాలు.. గుండె మధ్యన చాలా బరువుగా ఉంటుంది. ఛాతి మీద ఏదో బరువు ఉన్న భావన కలుగుతుంది. విపరీతమైన చెమట, ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ ఉంటాయి. కొందరిలో అనుకోకుండా వాంతులు, విరేచనాలు అవుతాయి. కొందరిలో ఛాతి మొత్తం నొప్పిగా ఉంటుంది.
చూశారుగా ఛాతి నొప్పి రావడానికి ఇలా రెండు రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఏ రకమైన నొప్పి కనిపించినా అశ్రద్ధ చేయకుండా, సొంత వైద్యాన్ని పాటించకుండా వీలైనంత త్వరగా వైద్యున్ని సంప్రదించి వారి సూచనల మేరకు పరీక్షలు చేయించుకుంటే మంచిది.
Also Read: Ind vs Pak T20 Match : విజయగర్వంతో ఎగిరెగిరి పడుతున్న పాక్.. నోటి దూలతో రెచ్చిపోయిన పాక్ మంత్రి..
Chandrababu: హస్తిన టీడీపీ అధినేత చంద్రబాబు బృందం ఫిర్యాదులు, విన్నపాలు, వినతుల పరంపర