Ind vs Pak T20 Match : విజయగర్వంతో ఎగిరెగిరి పడుతున్న పాక్.. నోటి దూలతో రెచ్చిపోయిన పాక్ మంత్రి..
Ind vs Pak T20 Match : ఐసీసీ టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో భాగంగా ఆదివారం నాడు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాభవాన్ని..
Ind vs Pak T20 Match : ఐసీసీ టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో భాగంగా ఆదివారం నాడు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం కూడా విధితమే. అయితే, ‘పొద్దెరుగని కొత్త బిచ్చగాళ్ళు’.. అన్న నానుడి మాదిరిగా గెలవక గెలవక ఒక్క మ్యాచ్ గెలిచి రెచ్చిపోతున్నారు పాకిస్తాన్‌కు కొందరు వ్యక్తులు. నోటికి దూల ఎక్కువై కారు కూతలు కూస్తున్నారు. సామాన్యులంటే ఏమో అనుకోవచ్చు.. కానీ బాధ్యత కలిగిన ఓ మంత్రి తన స్థాయిని మరిచి చిల్లర కామెంట్లు చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో పాక్ గెలుపు ఇస్లాం విజయం అని, భారత ముస్లింలు తమవైపే ఉన్నారని అంటూ అడ్డమైన కామెంట్స్ చేశాడు. దానికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఇంకా ఏమన్నాడంటే.. ‘‘మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించిన పాక్‌కు అభినందనలు. పట్టుదలతో ప్రత్యర్థిని ఓడించారు. పాక్ సత్తా ఏంటో ముస్లిం ప్రపంచం ముందు ప్రదర్శించారు. మనకు ఇదే టీ20 ప్రపంచకప్ ఫైనల్. అందుకే దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకొనేందుకు నగరాల్లో బారికేడ్లను తొలగించాలని ఆదేశించాను. భారత్ సహా ప్రపంచంలోని ముస్లిం లందరి మద్దతు పాక్‌కు ఉంది. ఇది ఇస్లాం విజయం.’’ అని అని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నాడు.
కాగా, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత ఓటమి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన ఓటమి పాలవడంతో యావత్ దేశం నిరాశలో ఉంటే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. శ్రీనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కొందరు పాక్ విజయానికి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి వేడుక జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదేం విధానం అంటూ మండిపడుతున్నారు.
پاکستان انڈیا میچ ٹکرا: پاکستانی کرکٹ ٹیم اور عوام کو مبارکباد پیش کرتا ہوں.https://t.co/Tc0IG0n2DJ@GovtofPakistan @ImranKhanPTI #PakvsIndia pic.twitter.com/e9RkffrK2O
— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) October 24, 2021
Also read:
Ind Vs Pak: మహ్మద్ షమీ నీకు మద్దతు.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్..
Minister Anil Kumar Yadav: సీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్