T20 World Cup 2022: సెమీస్ చేరే జట్లు ఇవే.. ! దిగ్గజాలకు షాకిచ్చిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు

సెమీస్ చేరే జట్లు ఇవేనంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ ఇయాన్ ఛాపెల్ దిగ్గజాలకు షాకిచ్చాడు. ఆయన లిస్టులో ఏయే ఏయే జట్లు ఉన్నాయో ఓసారి చూద్దాం.

T20 World Cup 2022: సెమీస్ చేరే జట్లు ఇవే.. ! దిగ్గజాలకు షాకిచ్చిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
Ian Chappell
Follow us
Venkata Chari

|

Updated on: Oct 25, 2021 | 10:10 PM

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై చారిత్రాత్మక ఓటమి టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇది కోహ్లీసేన సెమీస్ చేరేందుకు కష్టతరంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత, ప్రస్తుతం టోర్నమెంట్‌లో తమ మిగిలిన 4 మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సెమీస్ చేరే జట్లు ఇవేనంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ దిగ్గజాలకు షాకిచ్చాడు. ఆయన లిస్టులో ఏయే ఏయే జట్లు ఉన్నాయో ఓసారి చూద్దాం.

టీ20 ప్రపంచ కప్‌లో టాప్ టీంలపై మాములుగానే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే ఇయాన్ ఛాపెల్ మాత్రం కొన్ని టాప్ టీంలు సెమీస్‌లో చోటు సంపాధించవంటూ పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీలో సూపర్ 12 గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ టీంలు సెమీస్ రేసులో ముందున్నాయంట. అలాగే గ్రూపు 2 నుంచి పాకిస్తాన్, భారత్ జట్లు సెమీస్ పోరులోకి దూసుకెళ్తాయంట. అయితే, గ్రూపు 1 నుంచి ఆస్ట్రేలియా టీం మాత్రం సెమీస్ చేరదంటూ బాంబ్ పేల్చాడు. అలాగే గ్రూపు 2లో ఉన్న న్యూజిలాండ్ టీం అన్ని జట్లకు గట్టి పోటీ ఇస్తుందని ఆయన అన్నారు.

మరోవైపు పాకిస్థాన్‌తో పాటు, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు భారత జట్టు గ్రూపులో ఉన్నాయి. రెండు అసోసియేట్ దేశాలైన నమీబియా, స్కాట్లాండ్‌లపై టీమిండియాతోపాటు, న్యూజిలాండ్, పాకిస్తాన్ సులభంగా గెలిచే ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ మూడు టీంలకు తలో 2 పాయింట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌ టీంపై గ్రూపుల 1లోని మూడు జట్లు కూడా తమ తమ మ్యాచ్‌లను గెలిస్తే.. పాకిస్తాన్ 8 పాయింట్లతో గ్రూప్‌లో తొలిస్థానం, రెండో స్థానంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలో 6 పాయింట్లతో ఉండనున్నాయి.

ఇక టీమిండియా, న్యూజిలాండ్‌ టీంల మధ్య గట్టి పోటీ ఉండనుంది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా ఇరుజట్లు తమ ఉత్తమ ఫాంను మ్యాచులో చూపించాల్సి ఉంటుంది.

Also Read: Ind vs Pak T20 Match : విజయగర్వంతో ఎగిరెగిరి పడుతున్న పాక్.. నోటి దూలతో రెచ్చిపోయిన పాక్ మంత్రి..

Shami: షమీకి వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలు.. మండిపడ్డ సెహ్వాగ్

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే