Shami: షమీకి వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలు.. మండిపడ్డ సెహ్వాగ్
దాయాది పాక్ చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. అవి ఒక్కసారిగా అడియాశలు అయ్యాయి. ఈ చేదు ఫలితం భారతీయులకు రుచించని మాట వాస్తవం.
దాయాది పాక్ చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. అవి ఒక్కసారిగా అడియాశలు అయ్యాయి. ఈ చేదు ఫలితం భారతీయులకు రుచించని మాట వాస్తవం. పాక్ అన్ని విభాగాల్లో సత్తా చాటి భారత్‌పై ఏకపక్ష సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది. . అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ టీమ్.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. భారత్ నుంచి విరాట్ కోహ్లీ 49 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 36 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. మిగతా ఎవరూ ఆకట్టుకోలేదు. బౌలింగ్ విభాగం కూడా సత్తా చాటలేకపోయింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్.. హాఫ్ సెంచరీలు చేశారు. మనవాళ్లు ఒక్కరూ కూడా వికెట్ తీయలేకపోయారు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులను సమర్పించుకున్నారు. ఎన్నో అద్భుతాలు చేస్తూ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న షమికి ఆదివారం బ్యాడ్ డే అని చెప్పాలి. అతడు వేసిన 3.5 ఓవర్లలో 43 పరుగులు వచ్చాయి. దీంతో ఓటమికి షమి బాధ్యుడిని చేస్తూ.. నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా వేలాది మంది పోస్టులు పెడుతున్నారు. మరీ దారుణంగా అతడి మతాన్ని కూడా టార్గెట్ చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు.
షమీకి వ్యతిరేకంగా కొందరు చేస్తోన్న జాత్యహంకార వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు. ముఖ్యంగా భారత మాజీ ఆటగాడు షమీకి మద్దతుగా ట్వీట్ వేశాడు. జట్టు ఓటమికి షమీని ఒక్కడినే బాధ్యుడిని చేయడం… వ్యక్తిగతంగా, మతంపరంగా అతడిని దూషించడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. షమీకి నైతికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. షమీ ఒక ఛాంపియన్ అని.. ఇండియా టోపీ ధరించిన ప్రతి ఒక్కరూ.. వారి హృదయాలలో దేశం పట్ల భక్తిని కలిగి ఉంటారని పేర్కొన్నారు. మ్యాచ్‌లో గెలుపోటములు సహజమేనని, దానికి ఒక కులానికో లేదా మతానికో.. పూయాలనుకోవడం సరికాదని చెప్పారు.
The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021
Also Read: ఆనందయ్య పెట్టుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
రిజ్వాన్ మాములోడు కాదు.. పక్కా ప్లానింగ్‌తో వచ్చాడు.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఐసీసీ