IND vs PAK: ‘వారికి అనుకూలంగా ట్వీట్లు చేస్తావా.. నీపై కేసులు పడతాం’: భారత మాజీ ఓపెనర్‌పై నెటిజన్ల ట్రోల్స్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ తొలి విజయం సాధించిన తర్వాత, ఢిల్లీతో సహా కొన్ని ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కోపం కూడా బాంబులా పేలింది.

IND vs PAK: 'వారికి అనుకూలంగా ట్వీట్లు చేస్తావా.. నీపై కేసులు పడతాం': భారత మాజీ ఓపెనర్‌పై నెటిజన్ల ట్రోల్స్
Gautam Gambhir
Follow us
Venkata Chari

|

Updated on: Oct 25, 2021 | 5:27 PM

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ తొలి విజయం సాధించిన తర్వాత, ఢిల్లీతో సహా కొన్ని ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కోపం కూడా బాంబులా పేలింది. దీపావళి రోజున కూడా పటాకులు పేల్చడం వల్ల వచ్చే నష్టమేమిటని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌లో ప్రశ్నించారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం నిషేధించారు. అయితే నిన్న భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ విజయాన్ని పురస్కరించుకుని పటాకులు పేల్చారు. సరే వారు క్రికెట్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి, దీపావళి రోజున క్రాకర్స్ పేల్చడం వల్ల వచ్చే నష్టమేమిటో అంటూ ఓ ట్వీట్ చేశాడు.

నిజమైన భారతీయులు అలాంటి వారు కాదు: గంభీర్ సెహ్వాగ్ మాజీ సహ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ట్వీట్ చేశాడు. పటాకులు పేల్చే వారిని తిడుతూ ట్వీట్ చేశాడు. ఈమేరకు బీజేపీ ఎంపీ గంభీర్ #Shameful హ్యాష్‌ట్యాగ్‌తో.. ‘పాక్ విజయంపై నిజమైన భారతీయులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకోలేరు’ అంటూ కామెంట్ చేశారు.

దీంతో ఈ ఇద్దిరికీ వ్యతిరేకంగా కొంతమంది నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు. కొంతమంది ట్రోలర్లు సెహ్వాగ్ ఓమత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు అతనిపై ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని అధికారాలను డిమాండ్ చేశారు.

అయితే, అలాంటి ట్రోలర్లపై సెహ్వాగ్, గంభీర్ అభిమానుల నుంచి తీవ్రమైన ప్రతిదాడిని ఎదుర్కొన్నారు. ఇద్దరికీ భారీగానే మద్దతు లభించింది.

అనంతరం సెహ్వాగ్ పాకిస్థాన్ విజయానికి అభినందనలు తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. టీమిండియా ఓటమి తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ పటాకులు పేల్చే వారికి మాత్రమే సలహా ఇచ్చాడు. అంతకుముందు, అద్భుతమైన ఆటతో మ్యాచ్ గెలిచిన పాకిస్తాన్ జట్టును కూడా అభినందించాడు. పాక్ విజయం అత్యుత్తమ ప్రయత్నానికి నిదర్శనమని ట్వీట్ చేస్తూ ఆయన అభివర్ణించారు.

అలాగే టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీపై జరుగుతోన్న ట్రోల్స్‌కు కూడా సెహ్వాగ్ గట్టి సమాధానం చెప్పాడు. ‘మహ్మద్ షమీపై నెట్టింట్లో జరుగుతోన్న దాడి దిగ్భ్రాంతికరం. మేం అతనికి అండగా నిలుస్తాం. అతను ఒక ఛాంపియన్. ఇండియా టోపీ ధరించిన ఎవరైనా వారి హృదయాలలో భారతదేశాన్ని మాత్రమే కలిగి ఉంటారని’ ఆయన పేర్కొన్నారు.

Also Read: IND vs PAK: రిజ్వాన్​ మాములోడు కాదు.. పక్కా ప్లానింగ్‌తో వచ్చాడు.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఐసీసీ

Indian Cricket Team: ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే.. లేదంటే కోహ్లీసేన దుకాణ్ బంద్.. సెమీఫైనల్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?