ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అహ్మదాబాద్, లక్నో నగరాల నుంచి 2 కొత్త జట్లను కొనుగోలు చేయడానికి అనేక పెద్ద కంపెనీలు బిడ్లను వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ (RPSG), CVC క్యాపిటల్ గ్రూపు బిడ్లను గెలిచాయి. ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద బిడ్‌లను కోట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాయి. సంజీవ్ గోయెంకా గ్రూప్ (RPSG) లక్నో జట్టును రూ. 7,090 కోట్లకు కొనుగోలు చేయగా, CVC క్యాపిటల్ గ్రూపు అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ. 5625 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.