Venkata Chari |
Updated on: Oct 25, 2021 | 6:33 PM
ప్రపంచంలోని అతి పెద్ద లీగ్ అయిన ఐపీఎల్ థ్రిల్ మరింత పెరగబోతోంది. ఎందుకంటే దాని తదుపరి సీజన్ 2022 లో మరిన్ని కొత్త జట్లు రానున్నాయి. దుబాయ్‌లో 2 కొత్త టీమ్‌ల కోసం బిడ్డింగ్ జరుగుతోంది. నివేదికల ప్రకారం, 9 కంపెనీలు వారిపై భారీగా వేలం వేశాయి.
నివేదికల ప్రకారం, బిడ్డింగ్‌లో అదానీ గ్రూప్, ఆర్‌పీఎస్‌జీ, అవ్రామ్ గ్లేజర్, జిందాల్ స్టీల్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, హిందూస్థాన్ టైమ్స్ మీడియా, రిద్ధి స్పోర్ట్స్ పాల్గొన్నాయి.
నివేదికల మేరకు అహ్మదాబాద్, లక్నో జట్లు IPL 2022 లో ఆడబోతున్నాయి. బిడ్‌లో మాంచెస్టర్ యునైటెడ్, అదానీ ముందున్నారు.
అదానీ గ్రూప్ అహ్మదాబాద్ బృందాన్ని తమ సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. అతాగే లక్నో ఫ్రాంచైజీ మాంచెస్టర్ యునైటెడ్ గ్లేజర్ సొంతం కానుంది.
అవ్రామ్ గ్లేజర్ ఒక ప్రసిద్ధ అమెరికన్ వ్యాపారవేత్త. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్లబ్ అయిన మాంచెస్టర్ యునైటెడ్ యజమాని.