Health: డయాబెటీస్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకుంటున్నారా.? అయితే.. ఈ ఆహార పదార్థాలను భాగం చేసుకోండి..
Health: భారత దేశంలో ఎక్కువ మంది బాధపడే వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. వంశపారపర్యంగా, జీవన విధానం కారణంగా వచ్చే ఈ వ్యాధి ఒక్కసారి సోకితే..
Health: భారత దేశంలో ఎక్కువ మంది బాధపడే వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. వంశపారపర్యంగా, జీవన విధానం కారణంగా వచ్చే ఈ వ్యాధి ఒక్కసారి సోకితే అంత సులభంగా తగ్గదు. ఎన్ని రకాల మందులు వాడినా పూర్తిగా తొలిగిపోదు. కానీ షుగర్ పెరగకుండా కంట్రోల్‌లో పెట్టుకోవడం ఒక్కటే మన దగ్గర ఉన్న అవకాశం. మరి షుగర్‌ను కంట్రోల్‌లో ఉండడంలో మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని మీకు తెలుసా.? డయాబెటీస్ కంట్రోల్‌లో ఉండాలంటే తీసుకోవాల్సి కొన్ని ఆహార పదార్థాల వివరాలు ఓసారి చూద్దాం..
* డయాబెటీస్‌తో బాధపడేవారు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పాలకూర, ఫంగ్రీక్, బతువా, బ్రకోలి, పొట్లకాయ, సోరకాయ వంటివి తీసుకోవాలి.
* షుగర్ వ్యాధితో ఉన్న వారు ఎక్కువగా తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. పప్పులు శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తాయి.
* కోడిగుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఇది మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్, అమైనో ఆమ్లాలు మేలు చేస్తాయి. నిత్యం కోడిగుడ్డు తినేవారిలో టైప్-2 డయాబెటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
* పెరుగు కూడా షుగర్ పేషెంట్లకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. అయితే మధ్యాహ్న భోజనంలో మాత్రమే తీసుకోవాలి. పెరుగులో ఉండే పాలిఅన్‌సాచురేటెడ్, ఒమేగా-6 వంటి కాంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లాలు ఆరోగ్యకరమైన చక్కెరలను పెంచుతాయి.
* షుగర్ పేషెంట్లకు అడ్వైజ్ చేసే ఆహార పదార్థాల్లో చేపలు కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా సార్డైన్స్, హెర్రింగ్, సాల్మన్ చేపలను తినడం చాలా మంచివి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతోపాటు డీహెచ్‌ఏ, ఏపీఏలు ఎక్కువగా లభిస్తాయి. చేపలను తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Also Read: Biological E: నవంబర్ నెలాఖరుకల్లా కరోనా టీకాల పంపిణీ ప్రారంభించబోతోన్న బయోలాజికల్-ఈ కంపెనీ