Osmania Hospital: తెలంగాణ పెద్దాసుపత్రిలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. వైద్యురాలికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
Osmania Hospita Ceiling Fan: తెలంగాణకే పెద్దాసుపత్రి. చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతాయి అక్కడి బిల్డింగులు. రోగుల అవస్థలు వర్ణనాతీతం. ఈసరికే అర్థమై ఉంటుంది.. అది ఉస్మానియా హాస్పిటల్ అని..
తెలంగాణకే పెద్దాసుపత్రి. చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతాయి అక్కడి బిల్డింగులు. రోగుల అవస్థలు వర్ణనాతీతం. ఈసరికే అర్థమై ఉంటుంది.. అది ఉస్మానియా హాస్పిటల్ అని. ఆ మధ్య ఓ వైపు కోవిడ్ విరుచుకుపడుతుంటే.. మరోవైపు కురుస్తున్న వర్షంతో జల నిలయంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలిపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్లితే.. పీజీ సెకండియర్ చదువుతున్న డాక్టర్ భువన శ్రీ సోమవారం డెర్మటాలజీ విభాగంలో ఓపీ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పరిశీలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుగుతున్న ఫ్యాన్ ఒక్కసారిగా ఊడిపడింది. అక్కడే విదులు నిర్వహిస్తున్న డాక్టర్ తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది.
తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు వెంటనే వైద్య సేవలు అందించారు. అయితే ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గతంలో కూడా ఉస్మానియా ఆసుపత్రిలో పెచ్చులు మీద పడి అనేక మంది గాయాలయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. ఐదేళ్ల క్రితం ధోని ఏం చెప్పాడో ఇప్పుడు అచ్చు అలాగే జరిగింది..