Snake Bite: వీడని పాము మిస్టరీ.. మళ్లీ మూడు సార్లు కాటేసిన సర్పం.. 15 రోజుల్లో 8 కాట్లు..

ఉత్తర ప్రదేశ్ లో నెలకొన్న పాము మిస్టరీ ఇంకా వీడలేదు. ఓ యువకుడిని ఐదు సార్లు ఒకే చోట కాటేసిన పాము.. దాడి చేస్తూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో మూడు సార్లు కాటేసింది. వీటితో కలిపి ఆ పాము...

Snake Bite: వీడని పాము మిస్టరీ.. మళ్లీ మూడు సార్లు కాటేసిన సర్పం.. 15 రోజుల్లో 8 కాట్లు..
Snake
Follow us

|

Updated on: Sep 22, 2022 | 6:44 PM

ఉత్తర ప్రదేశ్ లో నెలకొన్న పాము మిస్టరీ ఇంకా వీడలేదు. ఓ యువకుడిని ఐదు సార్లు ఒకే చోట కాటేసిన పాము.. దాడి చేస్తూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో మూడు సార్లు కాటేసింది. వీటితో కలిపి ఆ పాము ఇప్పటివరకు ఎనిమిది సార్లు కాటేసింది. అయితే ఆ పాము.. ఆ యువకుడినే టార్గెట్ చేయడంపై అతని కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేవలం 15 రోజుల్లోనే 8 సార్లు పాము కాటుకు గురవడంతో ఆ గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఉత్తర​ప్రదేశ్ రాష్ట్రంలోని మన్​కేఢా గ్రామానికి చెందిన రజత్ చాహర్ పై పాము పగ బట్టిందా అన్నట్లు వెంబడించి మరీ కాటేస్తుండటం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అతనిని వివరాలు సేకరించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఏడాది క్రితం రజత్ సోదరుడు ఓ పామును చంపాడు. అప్పుడు అతను నొయిడాలో ఉన్నాడు. అయితే పాము పగ బట్టింది అనుకున్నా.. తన సోదరుడిపై దాడి చేయాలి గానీ.. రజత్ పై ఏకంగా 8 సార్లు ఎందుకు కాటేసిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చెందాడు. పాముకు భయపడి తాను ఎక్కడికీ వెళ్లడం లేదని పేర్కొన్నాడు.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా మన్​కేఢా గ్రామంలో నివాసముండే రజత్ చాహర్.. డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 6న రాత్రి సమయంలో ఇంటి బయట అతని ఎడమ కాలిపై పాము కాటేసింది. వెంటనే అలర్ట్ అయిన కుటుంబసభ్యులు వచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించకుండా నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. పరిస్థితి తీవ్రత ఎక్కువగా మారడంతో ఎస్​ఎన్​మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. రజత్ ను పరీక్షించిన వైద్యులు పాముకాటు లక్షణాలేమీ లేవని చెప్పి ఇంటికి పంపించారు. 8న వాష్ రూమ్ వద్ద, ఈనెల 11న ఇంట్లో మూడోసారి, 13న బాత్రూమ్​లో నాలుగోసారి, ఈ నెల 14న చెప్పులు వేసుకుంటుండగా ఐదో సారి రజత్​ను పాము కరిచింది. అది కూడా ఎడమ కాలిపై మాత్రమే. అయితే రజత్ ను ఆస్పత్రికి తీసుకువెళ్తున్న కుటుంబసభ్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం అలాంటి లక్షణాలేవి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

Snake Bite Student

Snake Bite Student

ఈ క్రమంలో పాము మళ్లీ మూడు సార్లు కాటేయడం మిస్టరీగా మారింది. ఎందుకు అతనినే టార్గెట్ చేస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రజత్ చాహర్ ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అతనిని పరామర్శిస్తున్నారు. ఇంటి వద్ద రకరకాల పూజలు చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం