AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ ప్రకటనతో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు షాక్.. సచిన్ రూట్ క్లీయర్..

రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు ఒకరి ఇబ్బందిగా మారితే.. మరొకరు పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గెహ్లాట్‌కు రాహుల్ చేసిన ప్రకటన రుచించడం లేదని..

Rahul Gandhi: రాహుల్ ప్రకటనతో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు షాక్.. సచిన్ రూట్ క్లీయర్..
Rahul Gandhi
Sanjay Kasula
|

Updated on: Sep 22, 2022 | 6:34 PM

Share

‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సూత్రాన్ని పాటిస్తూ ఉదయ్‌పూర్ సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అనుసరిస్తుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఉదయ్​పుర్​లో జరిగిన చింతన్ శిబిర్​లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాహుల్ గాంధీ మరోసారి గుర్తు చేశారు. ‘ఒకే వ్యక్తి ఒకే పదవి’ అనే విషయంలో రాజీ పడేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అనేది ఒక సంస్థాగత పదవి మాత్రమే కాదని.. అది ఒక సైద్ధాంతిక, నమ్మకమైన వ్యవస్థ అని అభివర్ణించారు. చింతన్ శిబిర్​లో ఏదైతే తీర్మానించామో.. దానికి తాము కట్టుబడి ఉన్నామని రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్​ పార్టీకి ఎవరు అధ్యక్షులు అయినా.. ఆ పదవి కొన్ని ఆలోచనల సమూహం అనే విషయం గుర్తుంచుకోవాలని రాహుల్​ సూచించారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కొనసాగబోయే వారికి పలు సూచనలు చేశారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఇప్పుడు ఒకరికి ఇబ్బందిగా మారితే.. మరొకరికి సంతోషాన్ని నింపుతోంది. 

రాహుల్ గాంధీ ప్రకటన సచిన్ పైలట్‌కు ఉపశమనం కలిగించే అంశం కాగా అధ్యక్ష రేసులో ఉన్న రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు షాకింగ్ న్యూస్‌లా మారింది. సచిన్ పైలట్ రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవిపై కూర్చోవాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉండగా.. గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయవచ్చు. గెహ్లాట్ ఎన్నికైతే రాజస్థాన్‌లో పార్టీ కొత్త ముఖ్యమంత్రిని నియమించే అవకాశం ఉంది. అశోక్ గెహ్లాట్, శశి థరూర్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. 

ఇదిలావుంటే.. రాహుల్ గాంధీని కలిసేందుకు అశోక్ గెహ్లాట్ కేరళ చేరుకున్నారు. కేరళకు వెళ్లే ముందు ఆయన బుధవారం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని.. తాను ఏ అభ్యర్థికీ మద్దతివ్వబోనని సోనియా గాంధీ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో రాజస్థాన్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  

సీఎం కుర్చీని వీడేందుకు ఇష్టంగా లేరు..

అశోక్ గెహ్లాట్ వచ్చే వారం రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీని వదులుకోవడానికి ఆయన ఇష్టపడటం లేదు. నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ ఫారాలు గురువారం నుండి అందుబాటులో ఉంటాయి, సెప్టెంబర్ 24 మరియు సెప్టెంబర్ 30 మధ్య నామినేషన్లు దాఖలు చేయబడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం