నడిరోడ్డుపై నరికి చంపారు.. పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు.. ఆ తర్వాత
పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా విచక్షణరహితంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ ఘటన...
పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా విచక్షణరహితంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ ఘటన దృశ్యాలు సోషల్(Social Media) మీడియాలో వైరల్ గా మారాయి. పంజాబ్ లో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడి, పొడిచి దారుణంగా హత్య చేశారు. బాధితుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి వెళ్లడం గమనార్హం. పంజాబ్(Punjab) రాష్ట్రంలోని మోగా జిల్లాలో బాధిని కలాన్ ప్రాంతంలో దేశ్ రాజ్ అనే యువకుడు కూలీగా పనిచేస్తున్నాడు. రోజూలాగే పనికి వచ్చిన రాజ్ ను కొందరు యువకులు కత్తులతో వెంబడించారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి, గాయపరిచి, దారుణంగా హత్య చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువకుడిపై దాడి చేసిన తర్వాత దుండగులు.. అతను చనిపోయాడని నిర్దారించుకున్నాకే అక్కడి నుంచి పయనమయ్యారు. పట్టపగలే, నడిరోడ్డుపై ఇంత దారుణం జరిగినా ఎవరూ ఆ యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించకపోవడం బాధాకరం. ఈ ఘటన జరగడం పట్ల కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Another Day – Another Broad Daylight Brutal Murder in Moga, Punjab.
కొద్ది రోజుల క్రితమే దేశ్ రాజ్ కు, దుండగులకు మధ్య గొడవ జరిగింది. ఈ మేరకు రాజ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న దుండగులు రాజ్ పై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా రాజ్ అప్పటికే మృతిచెందాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం యువకుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.