AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

76 ఏళ్ల వృద్ధుడి 3 పెళ్లిళ్ల కేసు హైకోర్టుకు,.. మూడో పెళ్లైన 25ఏళ్లకు ఇద్దరు భార్యల ఫిర్యాదు.. ట్విస్ట్‌ ఏంటంటే..!

76 ఏళ్ల వృద్ధుడి 3 పెళ్లిళ్ల వృత్తాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడి పెద్ద భార్య ఫిర్యాదుపై అతడు హైకోర్టును ఆశ్రయించాడు. మూడో పెళ్లి చేసుకున్న 25ఏళ్ల తర్వాత..

76 ఏళ్ల వృద్ధుడి 3 పెళ్లిళ్ల కేసు హైకోర్టుకు,.. మూడో పెళ్లైన 25ఏళ్లకు ఇద్దరు భార్యల ఫిర్యాదు.. ట్విస్ట్‌ ఏంటంటే..!
Marriage
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2022 | 8:26 AM

Share

76 ఏళ్ల వృద్ధుడి 3 పెళ్లిళ్ల వృత్తాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడి పెద్ద భార్య ఫిర్యాదుపై అతడు హైకోర్టును ఆశ్రయించాడు. మూడో పెళ్లి చేసుకున్న 25ఏళ్ల తర్వాత అతని మొదటి ఇద్దరు భార్యలు అతనికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆనంద్ అనే వ్యక్తి 1968లో చంద్రమ్మను పెళ్లి చేసుకున్నాడు. 1972లో సావిత్రమ్మతో వివాహమైంది. చంద్రమ్మ రెండో పెళ్లికి సమ్మతించిందని ఆనంద్ పేర్కొన్నాడు. ఆనంద్ 1993లో వరలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడి మూడు పెళ్లిళ్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. అతని మొదటి ఇద్దరు భార్యలు మాత్రమే తమ భర్తలను కోర్టుకు లాగారు. మూడో పెళ్లి చేసుకుని 25 ఏళ్లు గడిచిన తర్వాత మొదటి ఇద్దరు భార్యలు ఫిర్యాదు చేసి.. భర్త సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. అయితే కోర్టులో పెద్దాయన మూడు పెళ్లిళ్ల విషయాన్ని అంగీకరించాడు.

బెంగళూరుకు చెందిన ఆనంద్ 1968లో చంద్రమ్మను పెళ్లి చేసుకున్నాడు. 1972లో సావిత్రమ్మతో వివాహమైంది. చంద్రమ్మ రెండో పెళ్లికి సమ్మతించిందని ఆనంద్ పేర్కొన్నాడు. ఆనంద్ 1993లో వరలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అయితే, తాజాగా, మొదటి ఇద్దరు భార్యలు తనపై దాఖలు చేసిన కేసును రద్దు చేయాలంటూ 76 ఏళ్ల వృద్ధుడు ఆనంద్‌ హైకోర్టును ఆశ్రయించాడు. కాగా, అతడి పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఆనంద్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.నాగప్రసన్న మే 25న తన తీర్పులో ఆనంద్, అతని మూడవ భార్యకు మునుపటి వివాహాల గురించి తెలుసు కాబట్టి వారిపై కేసును రద్దు చేయలేమని తీర్పు చెప్పారు. అయితే, ఆనంద్ స్నేహితులపై పెట్టిన బెదిరింపు కేసు కొట్టివేయబడింది. “మొదటి పిటిషనర్ (ఆనంద్) ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు రెండవ వివాహం, మూడవ వివాహానికి బాధ్యులని నిర్ధారిస్తే తప్ప ఈ విచారణలో చేర్చబడదు” అని హైకోర్టు పేర్కొంది.

ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది, ఇద్దరు భార్యల చట్టం సాధారణంగా భర్త, భార్య, రెండవ భార్యతో కూడిన ట్రైయాంగిల్‌..కానీ, ఇది నాలుగు విధాలుగా ఉన్న ఒక విచిత్రమైన కేసు. కాబట్టి, మొదటి పిటిషనర్, రెండవ పిటిషనర్, ఫిర్యాదుదారుని విభజించాలి. తమలో తాము “ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. అదే సమయంలో ఇతర నిందితులను నిర్దోషులుగా విడుదల చేయాలని హైకోర్టు పేర్కొంది.