చట్టానికి మీరేమైనా అతీతులా …? ట్విటర్ పై పార్లమెంటరీ కమిటీ కమిటీ ‘చీవాట్లు’ ! మళ్ళీ సమన్లు !

ఇండియాలో ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా నడచుకోలేదని ఆరోపణలకు గురైన ట్విటర్ పై ఐటీ, టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మండిపడింది. ఈ సామాజిక మాధ్యమానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను కాంగ్రెస్..

చట్టానికి మీరేమైనా అతీతులా ...? ట్విటర్ పై పార్లమెంటరీ కమిటీ కమిటీ 'చీవాట్లు' ! మళ్ళీ సమన్లు !
You Are Not Above The Law Says Parliamentary Committee To Twitter
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 19, 2021 | 11:08 AM

ఇండియాలో ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా నడచుకోలేదని ఆరోపణలకు గురైన ట్విటర్ పై ఐటీ, టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మండిపడింది. ఈ సామాజిక మాధ్యమానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వాన గల ఈ కమిటీ శుక్రవారం సుమారు గంటన్నర సేపు విచారించింది. ప్రభుత్వ రూల్స్ ని ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించింది. ట్విటర్ నిర్వాకాన్ని కేంద్రం ఇటీవలే తీవ్రంగా పరిగణించి..దీనికి షో కాజ్ నోటీసులను కూడా జారీ చేసింది. కానీ దీనికి ఈ సంస్థ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఏకంగా పార్లమెంటరీ కమిటీ కూడా రంగంలోకి దిగింది. చట్టానికి మీరేమీ అతీతులు కారని, ప్రభుత్వ నిబంధనలకన్నా మీ రూల్స్ ఎక్కువేమీ కాదని ఈ కమిటీ దాదాపు దుయ్యబట్టింది. అయితే తమ రూల్స్ కూడా ఇంతే తమకు సమానమని ఈ ప్రతినిధులు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. కమిటీ సూచనలను వీరు పాజిటివ్ గా తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మీరిలాగే వ్యవహరిస్తే మీకు న్యాయపరమైన రక్షణ (లీగల్ ప్రొటెక్షన్) ఉండదని కేంద్రం హెచ్చరించిన విషయాన్ని పార్లమెంటరీ కమిటీ వీరి దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఇప్పటికీ ట్విటర్ వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ కమిటీ గత వారం దీనికి సమన్లు జారీ చేసిన అంశం గమనార్హం.

నిన్న జరిగిన సమావేశంలో ట్విటర్ ఇండియా తరఫు లీగల్ న్యాయవాది ఆయుషి కపూర్, సీనియర్ మేనేజర్ షగుఫ్తా కమ్రాన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ‘టూల్ కిట్’ కేసులో ట్విటర్ సరళిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు కూడా.. లోగడ ఈ కేసుకు సంబంధించి బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ‘ట్విటర్ వార్’ జరిగిన సంగతి తెలిసిందే. ఇండియాలో తమ కాంప్లియెన్స్ అధికారులను తప్పనిసరిగా నియమించాలన్న ప్రధాన నిబంధనను ట్విటర్ పెద్దగా పట్టించుకోలేదు. వీరిని తాము నియమించినట్టు పేర్కొన్నా.. వీరి వివరాలను సరిగా వెల్లడించలేదని తెలిసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్‌..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.

Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .

Viral Video : తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని హార్డ్ వర్క్ చేస్తున్న ఇంటిలిజెంట్ (వీడియో).

బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.