AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ కేసులో బాలీవుడ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీపైనా అనుమానపు నీలి నీడలు

ముంబైలోని ఓ హోసింగ్ సొసైటీలో జరిగిన ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ కేసులో బాలీవుడ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీ పై కూడా అనుమానపు నీలినీడలు ముసురుకుంటున్నాయి. ఈ కేసులో పోలీసులు నలుగురిని ఇదివరకే అరెస్టు చేశారు.

ముంబై ఫేక్  వ్యాక్సినేషన్ క్యాంప్ కేసులో బాలీవుడ్  మ్యూజిక్ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీపైనా అనుమానపు నీలి నీడలు
4 Arrested In Mumbai Fake Vaccination Camp
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 19, 2021 | 11:17 AM

Share

ముంబైలోని ఓ హోసింగ్ సొసైటీలో జరిగిన ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ కేసులో బాలీవుడ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీ పై కూడా అనుమానపు నీలినీడలు ముసురుకుంటున్నాయి. ఈ కేసులో పోలీసులు నలుగురిని ఇదివరకే అరెస్టు చేశారు. టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థకు హెడ్ అయిన రమేష్ తౌరానీ.. తమ సంస్థకు చెందిన 365 మంది ఉద్యోగులు గత మే 30 న, జూన్ 3 న ఈ సొసైటీలో వ్యాక్సిన్ తీసుకున్నారని, కానీ వారికీ ఇంకా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అందలేదని తెలిపారు. అయితే పోలీసులు ఈ వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉందా అని అనుమానిస్తున్నటు తెలుస్తోంది. ఆ ఉద్యోగులకు నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కొందరికి సెలైన్ వాటర్ ఇచ్చారట .. తమ ఉద్యోగులను చీట్ చేశారని రమేష్ తౌరానీ ఆరోపిస్తున్నారు. ఓ ఈవెంట్ ,మేనేజ్ మెంట్ కి చెందిన సంజయ్ గుప్తా అనే వ్యక్తిని, ఈ స్కామ్ కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మహేంద్ర సింగ్ ను కూడా ఖాకీలు ఈ స్కామ్ కు సంబంధించి విచారించే అవకాశం ఉంది.

ఒక ప్రైవేటు హాస్పిటల్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెబుతున్నప్పటికీ ..తాము ఎలాంటి క్యాంపును నిర్వహించలేదని…ఆ ఆసుపత్రి తెలిపిందని, ఇందులో పార్టిసిపేట్ చేసినవారి పేర్లు ఏవీ కోవిన్ పోర్టల్ లో లేవని తెలియవచ్చింది. హీరానందన్ హెరిటేజ్ రెసిడెంట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ విషయాలను తెలిపారు. ఈ ఫేక్ క్యాంప్ కేసులో పట్టుబడిన నలుగురికి లోగడ ఇదే తరహా చీటింగ్ యవ్వారంలో పాత్ర ఉందని పోలీసులు తెలిపినట్టు వారు చెప్పారు.

మొత్తానికి ఈ కేసుపై దర్యాప్తు జరిపిన అధికారులు మరి కొంతమందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ క్యాంప్ లో సెలైన్ వాటర్ ఇచ్చారన్న విషయం తెలిసి అధికారులు దిగ్భ్రాంతి చెందారు. బహుశా రిపోర్టులు అనుమానాస్పదంగా ఉన్న కారణంగానే ఇన్నాళ్లయినా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు రాలేదని భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్‌..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.

Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .

Viral Video : తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని హార్డ్ వర్క్ చేస్తున్న ఇంటిలిజెంట్ (వీడియో).

బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు