CORONA CASES: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఆ వేరియంట్లే కారణమా

రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన కరోనా కేసులు ఇప్పడు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. వివిధ రకాల కొత్త వేరియంట్లతో ఎప్పుటికప్పుడు మార్పు చెందుతున్న కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది.

CORONA CASES: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఆ వేరియంట్లే కారణమా
Covid In India
Follow us

|

Updated on: Mar 16, 2023 | 6:00 PM

రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన కరోనా కేసులు ఇప్పడు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. వివిధ రకాల కొత్త వేరియంట్లతో ఎప్పుటికప్పుడు మార్పు చెందుతున్న కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పడిప్పుటే ఆర్థికంగా గాడిలో పడుతున్న మనదేశంలో తాజాగా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం రోజున దాదాపు 754 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే సుమారు 22 శాతం కేసులు పెరిగాయని వెల్లడించింది. అయితే ఇలా కరోనా కేసులు మళ్లీ పెరగడం వెనుక మరో కొత్త వేరియంట్లు బయటపడినట్లు నివేదికలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వేరియంట్లను పరిశీలిస్తున్న నిపుణులు ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల వెనుక XBB.1, XBB.1.16 సబ్ వేరియంట్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ సబ్ వేరియంట్ల వల్ల కరోనా కేసులు మనదేశంలోనే కాక మరికొన్ని దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు.

XBB1.16 సబ్ వేరియంట్ తీవ్రమైనదా ? మనదేశంలో ప్రస్తుతం XBB సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కరోనా కేసులు తగ్గిపోవడంతో కొన్నిరోజుల పాటు కరోనా పరీక్షలు చేయడమే నిలిపివేసినట్లు ఐసీఎంఆర్ ఎపిడమాలజిస్టు జయప్రకాశ్ ముల్యాల్ తెలిపారు. ఇప్పుడు H3N2 ఫ్లూ కేసులు, ఇతర వైరస్ కేసులు పెరుగుతున్నాయన్నారు. అందుకే ఇప్పుడు జీనోమ్ టెస్టింగ్ చేయడం ప్రారంభించామని పేర్కొన్నారు. కరోనా వైరస్ లో సబ్ వేరియంట్లు గుర్తించడం అసాధరణ విషయమేమి కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైరస్ లు ప్రతిసారి తమ రూపాన్ని మార్చుకుంటూనే ఉంటాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త సమీరన్ పాండ తెలిపారు. అలగే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఒక విధంగా చూస్తే XBB1.16, XBB1.15 సబ్ వేరియంట్ల మధ్య తేడా ఏమి కనిపించడం లేదని.. ఈ వేరియంట్ల లక్షణాలు జ్వరం, గొంతునొప్పి, జలుబు, ఒళ్లు నొప్పులు, అలసట లాంటివి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..