నారీ భారత్.. గత కొన్నేళ్లుగా భారీగా ఉద్యోగాలు.. ఆకాశనందే ప్యాకేజీలు..
గత ఆరేళ్లుగా నిరుద్యోగం రేటు తగ్గుముఖం పట్టడం, శ్రామికశక్తిలో విద్యావంతులైన మహిళల సంఖ్య పెరగడం వెనుక దేశంలో ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమేనని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉపాధి వర్గాలలో మహిళల ఆదాయం స్థిరమైన పెరుగుదలను నమోదు చేసుకుంది.
భారతదేశంలో మహిళల సంపాదన పెరిగింది.. ఆశ్చర్యకరంగా దేశంలో వివిధ రంగాలలో ఆడవారు మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. ఇది మేం చెబుతున్న మాటలు కాదు.. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ఇటీవలి నివేదికలో పేర్కొంది. గత ఆరు సంవత్సరాల కాలంలో అనేక రంగాలలో వివిధ రకాల ఉద్యోగాలలో మహిళా శ్రామికశక్తి పెరుగుతోందని వెల్లడించింది. ఇందులో ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు ఉన్నాయి. దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ శ్రామిక మహిళల జనాభా పెరిగిందని మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనడమే దీనికి కారణం. ఈ మేరకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) గత ఆరేళ్లలో భారతీయ జాబ్ మార్కెట్ గణాంకాలను విడుదల చేసింది.
గత ఆరేళ్లుగా నిరుద్యోగం రేటు తగ్గుముఖం పట్టడం, శ్రామికశక్తిలో విద్యావంతులైన మహిళల సంఖ్య పెరగడం వెనుక దేశంలో ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమేనని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉపాధి వర్గాలలో మహిళల ఆదాయం స్థిరమైన పెరుగుదలను నమోదు చేసుకుంది.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) గత ఆరేళ్లలో మొత్తం భారతీయ కార్మిక మార్కెట్ సూచికలు మెరుగయ్యాయని స్పష్టం చేసింది. ఇది 2017-18లో 46.8 శాతం నుండి 2023-24లో 58.2 శాతానికి పెరిగి జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల శాతంగా నిర్వచించబడిన వర్కర్ పాపులేషన్ రేషియో (WPR)లో ప్రతిబింబిస్తుంది. మహిళల భాగస్వామ్య రేటు కూడా రెట్టింపు అయింది. మహిళా కార్మిక శక్తి 23.3 నుండి 41.7 శాతానికి పెరిగింది. ఇక్కడ నిరుద్యోగం రేటు 5.6 శాతం నుండి 3.2 శాతానికి పడిపోయింది.
మొత్తంమీద భారతదేశ కార్మిక మార్కెట్ సూచికలు గత ఆరేళ్లలో మెరుగయ్యాయని నివేదిక పేర్కొంది. ద్వైవార్షిక లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) సర్వేను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ నివేదిక కార్మిక జనాభా రేటును ప్రతిబింబిస్తుంది. ఇది ఉపాధిలో పాల్గొనే రేటును నిర్వచిస్తుంది. 2017లో ఉద్యోగుల రేటు 46.8శాతం, 2023-24లో 58.2శాతంగా నమోదైంది. ఆర్థిక స్థిరత్వం, మెరుగైన ఉద్యోగ లభ్యత కారణంగా నిరుద్యోగిత రేటు కూడా 6.0 నుండి 2 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది.
చదువుకున్న మహిళలు దాదాపుగా ఖాళీ ఉండటం లేదు.. అందుబాటులో ఉన్న ఉపాధి పనుల్లో నిమగ్నమయ్యే ధోరణి కూడా పెరిగింది. PLFS డేటా ప్రకారం, 2023-24లో, పోస్ట్-గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్లలో 19.6 శాతం మంది ఉపాధి పొందారు. 2017-18లో ఈ భాగస్వామ్యం 34.5గా ఉంది.
ఇదిలా ఉండగా, ఉన్నత పాఠశాల విద్యతో ఉన్న మహిళల ఉపాధి రేటు 2017-18లో 11.4శాతంగా, 2023-24లో 23.9శాతంగా ఉంది. ప్రాథమిక విద్య కలిగిన మహిళా కార్మిక వర్గం 2017-18లో 24.9 శాతం గానూ, 2023-24లో 50.2 శాతంగా ఉందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది.
మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..