ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో మంటలు.. బర్త్ డే ముందురోజే యువతి సజీవ దహనం.. ఏం జరిగిందంటే..

ప్రియ పుట్టిన రోజుకు ముందురోజు జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సంతోషంగా కూతురి బర్త్‌డే వేడుకలు చేసేందుకు సిద్ధపడ్డ ఆ తల్లిదండ్రులు బిడ్డ మరణంతో తల్లడిల్లిపోయారు.

ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో మంటలు.. బర్త్ డే ముందురోజే యువతి సజీవ దహనం.. ఏం జరిగిందంటే..
Electric Bike Showroom Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2024 | 12:03 PM

పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందే 20ఏళ్ల యువతి ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. సంతోషంగా కూతురి బర్త్‌డే వేడుకలు చేసేందుకు సిద్ధపడ్డ ఆ తల్లిదండ్రులు బిడ్డ మరణంతో తల్లడిల్లిపోయారు. ఐటి రాజధాని బెంగళూరులో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని ఈ వి రాజాజీనగర్‌లోని ఓ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్‌లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రిసెప్షనిస్ట్ ప్రియ సజీవ దహనం అయింది. కాగా బుధవారం (నవంబర్ 20) ఆమె పుట్టిన రోజు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రియ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈవీ బైక్ బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షోరూంలో అగ్ని ప్రమాదం నివారణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కూతురు ప్రియ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..