Viral video: దేశ చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీ…35 వేల మందితో 9రోజుల పాటు..

దాదాపు పండుగ వాతావరణాన్ని సృష్టించే విధంగా నిరసనకారులు పలు సంగీత వాయిద్యాలు ప్లే చేశారు. జెండాలతో వేలాది మంది సెంట్రల్ సిటీ పార్క్‌లో గుమిగూడారు. రోజంతా వారు అక్కడే తమ నిరసన వ్యక్తం చేశారు.

Viral video: దేశ చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీ...35 వేల మందితో 9రోజుల పాటు..
Biggest Rally
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2024 | 10:10 AM

న్యూజిలాండ్ దేశంలో మావోరి అనే తెగ ప్రజలు చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు. 335,000 కంటే ఎక్కువ మంది ప్రదర్శనకారులు హార్బర్‌సైడ్ నగరం వెల్లింగ్‌టన్‌లోకి పోటెత్తారు. అయితే, 5 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశంలో 35 వేల మందితో ర్యాలీ తీయడం ఆ దేశ చరిత్రలోనే లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, 1850లో బ్రిటిష్ వారు రూపొందించిన ఓ చట్టాన్ని ఇప్పుడు పున:సమీక్షించడమే ప్రజల ర్యాలీకి కారణమని సమాచారం.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

మావోరి అనే తెగ ప్రజలు తమ హక్కులను పలుచన చేయాలని ప్రత్యర్థులు చెబుతున్న బిల్లుకు వ్యతిరేకంగా వారంతా రోడ్డెక్కారు. వేలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీలో మావోరీ మరియు న్యూజిలాండ్ అంతటా వారి మద్దతుదారులు తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ ర్యాలీ నవంబర్ 19 మంగళవారం రోజున వెల్లింగ్‌టన్‌లో ముగిసింది.

వీడియో ఇక్కడ చూడండి..

దాదాపు పండుగ వాతావరణాన్ని సృష్టించే విధంగా నిరసనకారులు పలు సంగీత వాయిద్యాలు ప్లే చేశారు. జెండాలతో వేలాది మంది సెంట్రల్ సిటీ పార్క్‌లో గుమిగూడారు. రోజంతా వారు అక్కడే తమ నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..