Curry Leaves: చర్మ సమస్యల నుంచి మధుమేహం వరకు.. ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలితే అద్భుతం..!

ఇది మీ జుట్టు రాలే సమస్యను తక్షణమే తగ్గిస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. కరివేపాకును నీటిలో నానబెట్టి రోజూ తీసుకుంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. దీంతో ఒత్తైన,నల్లటి కేశ సంపద మీ సొంతం అవుతుంది. ఇదంతా తెలిసిందే, అయితే మధుమేహంలో ఎలా మేలు చేస్తుందో తెలిస్తే..

Curry Leaves: చర్మ సమస్యల నుంచి మధుమేహం వరకు.. ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలితే అద్భుతం..!
Curry Leaves
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 19, 2024 | 1:33 PM

కరివేపాకు ఆహారానికి సువాసన, మంచి రుచితో పాటు, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ముఖ్యమైనది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఉదయాన్నే పరగడుపున 4-5 ఆకులను తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కాలేయ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ శక్తిని బలోపేతం చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు లివర్ డ్యామేజ్‌ని నివారిస్తాయి. ఇంకా, కరివేపాకు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. కరివేపాకును ఉదయాన్నే తినడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్‌ ఉంటాయి. మరిన్ని లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..

కరివేపాకులో లినాలూల్, ఆల్ఫా-టెర్పినేన్, మైర్సీన్, మహానింబైన్, క్యారియోఫిలీన్, మురయానాల్ మరియు ఆల్ఫా-పినేన్ వంటి అనేక సమ్మేళనాలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మంచి పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించే సామర్థ్యం కరివేపాకులో ఉంది. ఎందుకంటే,..కరివేపాకు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సక్రియం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం కరివేపాకు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్‌లను గ్లూకోజ్‌గా విచ్ఛిన్న ప్రక్రియను నెమ్మదిస్తుంది.

ఒక నివేదిక ప్రకారం 30 రోజులపాటు కరివేపాకు తినేవారి రక్తంలో చక్కెర తగ్గినట్లు తేలింది. మధుమేహంతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో 5 కరివేపాకులను నమిలితే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కరివేపాకులను టీ రూపంలో కూడా తయారు చేసి తీసుకోవచ్చు. కరివేపాకు పొడిని సూప్ లేదా సలాడ్‌లో చేర్చుకుని తీసుకోవచ్చు. కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకు కూడా ఊబకాయాన్ని తగ్గిస్తుంది. దంత క్షయాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

కరివేపాకు జుట్టు పెరుగుదలను పెంచుతుంది. దీన్ని గ్రైండ్ చేసి హెయిర్ మాస్క్‌లా చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది మీ జుట్టు రాలే సమస్యను తక్షణమే తగ్గిస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. కరివేపాకును నీటిలో నానబెట్టి రోజూ తీసుకుంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. దీంతో ఒత్తైన,నల్లటి కేశ సంపద మీ సొంతం అవుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?