AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లింట విషాదం.. హల్దీవేడుకలో డ్యాన్స్‌ చేసిన వరుడు.. అంతలోనే కుప్పకూలిపోయాడు..

అందరూ పెళ్లి ఊరేగింపుకు సిద్ధమయ్యారు. బంధువులు వచ్చారు. వివాహం సోమవారం. కాగా, దానికి ఒక రోజు ముందు ఆదివారం శివమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేశాడు. ఆట పాటలతో అలిసిపోయిన అతడు.. హల్దీ వేడుకలో వెళ్ళి కూర్చున్నాడు.

పెళ్లింట విషాదం.. హల్దీవేడుకలో డ్యాన్స్‌ చేసిన వరుడు.. అంతలోనే కుప్పకూలిపోయాడు..
Groom Dies Of Heart Attack
Jyothi Gadda
|

Updated on: Nov 19, 2024 | 12:49 PM

Share

ఆకస్మిక మరణాల కేసులు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. పెళ్లికి మరికొద్ది క్షణాల ముందు వరుడు గుండెపోటుతో మృతి చెందాడన్న వార్త ఇరు కుటుంబాల్లో తీవ్ర కలకలం రేపింది. వరుడి మృతితో రెండు కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివాహం ఉత్సవంతో వధూవరులు ఇద్దరి ఇళ్లలో సందడి వాతావరణం కాస్త ఒక్కసారిగా దుఃఖ సాగరంగా మారింది. పెళ్లి పాటలు, డీజేలు మోగుతున్న ఆ ఇంట్లో జనం అరుపులు, ఆర్తనాదాలు వినిపించడం మొదలుపెట్టాయి. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హత్రాస్‌లోని భోజ్‌పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల శివం ఒక స్కూల్‌లో కంప్యూటర్ కోర్స్‌ చెబుతున్నాడు. ఆగ్రా నివాసి మోహినితో శివమ్ వివాహం నిశ్చయమైంది. అందరూ పెళ్లి ఊరేగింపుకు సిద్ధమయ్యారు. బంధువులు వచ్చారు. వివాహం సోమవారం. కాగా, దానికి ఒక రోజు ముందు ఆదివారం శివమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేశాడు. ఆట పాటలతో అలిసిపోయిన అతడు.. హల్దీ వేడుకలో వెళ్ళి కూర్చున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. కుటుంబీకులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఫలితం లేకపోయింది. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రిలో శివం చనిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు, బంధువులు నమ్మలేకపోయారు. కుటుంబీకులు అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ కూడా శివం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది.

వీడియో ఇక్కడ చూడండి..

అప్పటికే శివమ్‌ తండ్రి చనిపోయాడు. పెళ్లి నిశ్చయమైనా తరువాత పెళ్లికి ముందే శివమ్‌ మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్‌లో ఉండిపోయారు. ఆ ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు తల్లి, ఇద్దరు తమ్ముళ్లు మిగిలారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!