మెంతికూరలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్ కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెంతికూరను తరచూ డైట్‌లో భాగంగా చేసుకోవటం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా వారంలో రెండు సార్లు మెంతి కూర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.