AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్‌రే.. బిచ్చగాడి విందుకు 20వేల మంది అతిథులు.. ఖర్చు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఇదంతా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ బిచ్చగాడు ఇంత భారీ ఎత్తున విందు కార్యక్రమం ఏర్పాటు చేయటం పట్ల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాప్‌రే.. బిచ్చగాడి విందుకు 20వేల మంది అతిథులు.. ఖర్చు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
Beggar Family Hosts Grand Feast
Jyothi Gadda
|

Updated on: Nov 19, 2024 | 12:05 PM

Share

పాకిస్థాన్ నుంచి ఓ వింత వార్త వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు కూడా నోరెళ్ల బెట్టేలా ఓ బిచ్చగాడు చేసిన దావత్‌ ఏర్పాట్లు ఇంటర్‌నెట్‌ని సైతం ఊపేసింది. బిచ్చమెత్తుకూ జీవించే ఓ వ్యక్తి సుమారు 20,000 మందికి భారీ విందు భోజనాలు పెట్టించాడు. దీని కోసం ఏకంగా రూ.1.25 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి.. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతోపాటు కోటీశ్వరులు, నెటిజన్లు సైతం షాక్‌ అయ్యారు. అసలు విషయంలోకి వెళితే…

పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో ఈ సంఘటన జరిగింది. ఒక బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో 40వ రోజు స్మారకం సందర్భంగా అతడి కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది. స్థానికులను, తెలిసినవారిని భోజనాలకు ఆహ్వానించింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది వరకు ఈ విందుకు హాజరయ్యారు. సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు వివిధ మాంసాహార వంటకాలను వడ్డించారు. ఈ విందు కోసం సుమారు 250 మేకలు కొనుగోలు చేసినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఇకపోతే, విందు వచ్చే అతిథులను తరలించేందుకు సుమారు 2,000లకు పైగా వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. గుజ్రాన్‌వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఇదంతా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ బిచ్చగాడు ఇంత భారీ ఎత్తున విందు కార్యక్రమం ఏర్పాటు చేయటం పట్ల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆహారం తిన్న తర్వాత, అతిథులు ఈ కుటుంబాన్ని చాలా ప్రశంసించారు. ఆ బిచ్చగాడు ఎంత ధనవంతుడో విందు కోసమే ఇంత డబ్బు ఖర్చు పెట్టాడని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..