Fatty Liver: ఫ్యాటీలివర్.. సైలెంట్ కిల్లర్ !!
శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటి. అయితే జీవనశైలి కారణంగా మన చేతులతో మనమే దీనిని అనారోగ్యంపాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య నేటి యువత ప్రాణాలను సైలెంట్ గా హరిస్తోంది. దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి యువతలో నానాటికీ పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవ్వు కాలేయాన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు.
ఇది కాలేయ కణాలలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు సంభవించే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. మధుమేహం, ఊబకాయం ఉన్న రోగులలో దాదాపు 90 శాతం మందికి FLD (చెడు కొలెస్ట్రాల్) ఉంటుంది. ఇది అధిక బరువు ఉన్నవారిలో 75%, తీవ్రమైన ఊబకాయం ఉన్నవారిలో 90% మందిలో కనిపిస్తుంది. దేశంలో ఇప్పటికే 30-40 కోట్ల మంది ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న రోగులు ఉన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య ఒక రకమైన సైలెంట్ కిల్లర్. చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించవు. అందుకే వీలైనంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కాలేయం దెబ్బతిన్నా, అది కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రధాన సమస్య ఏమిటంటే ఈ సమస్యను ముందుగానే గుర్తించడం కష్టం. లక్షణాలు కనిపించడం ప్రారంభించే సమయానికి వ్యాధి పూర్తిగా తీవ్రమవుతుంది. శరీరంలో కాలేయం 50-60% పాడైపోయినా, దాని గురించి తెలిసే అవకాశం ఉండదు. కానీ కొందరికి ముఖం, మెడ ప్రాంతాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: TOP 9 ET News: ఐకాన్ స్టార్ క్రేజ్ చూసి.. షాకైన బీహార్ ప్రభుత్వం ఏకంగా పోలీస్ వాహనాన్నే ఢీకొన్న హీరోయిన్.. అట్లుంటది మనతోని డ్రైవింగ్ మరి !! గ్రేట్ !! రాశీ ఖన్నా సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇలా చేస్తే మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుకైనా...
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

