AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో మరిన్ని ట్రంప్ టవర్స్‌'' ప్రారంభానికి ట్రంప్ జూనియర్

భారత్‌లో మరిన్ని “ట్రంప్ టవర్స్‌” ప్రారంభానికి ట్రంప్ జూనియర్

Phani CH
|

Updated on: Nov 20, 2024 | 1:22 PM

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ భారత్​లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌, నోయిడా, బెంగళూరు సహా మొత్తం ఆరు నగరాల్లో 'ట్రంప్‌' బ్రాండ్‌ కింద లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ముంబయి కేంద్రంగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు.

దీంతో అమెరికా బయట అత్యధికంగా ట్రంప్‌ టవర్లు ఉన్న దేశంగా భారత్ నిలవనుంది. ట్రైబెకా డెవలపర్స్​తో కలిసి ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్ట్​లను నిర్మించనుంది ట్రంప్ సంస్థ. వీటి అమ్మకాల విలువ రూ.15,000 కోట్ల కంటే ఎక్కువే. కాగా, ఇప్పటికే భారత్​లోని ముంబయి, కోల్​కతా, గురుగ్రామ్, పుణె వంటి నాలుగు నగరాల్లో ట్రంప్‌ టవర్స్‌ ఉన్నాయి. తాజాగా నోయిడా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, పుణెలో టవర్స్ నిర్మిస్తామని ప్రకటించింది. దీంతో భారత్​లో ట్రంప్‌ టవర్ల సంఖ్య 10కి చేరనుంది. ట్రంప్ టవర్స్​లో నివాస, వాణిజ్య సముదాయాలు ఉంటాయని ట్రైబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేశ్ మోహతా తెలిపారు. అలాగే గోల్ఫ్ కోర్టులు, విల్లాలు కూడా ఉంటాయనన్నారు. నోయిడా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, పుణెలో వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. ‘ట్రంప్ వరల్డ్ టవర్స్’ పేరిట నిర్మాణాలు ఉంటాయన్నారు. అలాగే మొట్టమొదటిసారిగా ట్రంప్ కంపెనీ.. వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెట్టనుందనీ ప్రాజెక్టులో భాగంగా పుణెలో పెద్ద ఆఫీసును కట్టనుందనీ తెలిపారు. ప్రతి ప్రాజెక్ట్​లో స్థానిక డెవలపర్లు, భూ యజమానులు భాగస్వాములుగా ఉంటారనీ ట్రంప్ టవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక సూపర్ లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రాండ్‌ అని మెహతా అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

1000 రోజుల యుద్ధం.. మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా ??

Sai Pallavi: హీరోకు సమానంగా సాయి పల్లవికి రెమ్యునరేషన్ !! ఇదే ఇప్పుడు గొడవకు కారణం

Anchor Ravi: మొత్తానికి అనుకున్నది సాధించిన యాంకర్ రవి

Nayanthara: 183 కోట్ల ఆస్తులు.. ప్రైవేట్ జెట్.. దిమ్మతిరిగేలా సంపాదించిన నయన్ !!