Watch: మరీ ఇంత దారుణమా..? రీల్స్‌పిచ్చితో మతిలేని పనిచేసిన మోడల్‌..! నెటిజన్ల ఫైర్

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. రీల్స్‌ పిచ్చితో ఓ యువతి చేసిన చెత్త పనికి నెటిజన్లు భగ్గుమంటున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

Watch: మరీ ఇంత దారుణమా..? రీల్స్‌పిచ్చితో మతిలేని పనిచేసిన మోడల్‌..! నెటిజన్ల ఫైర్
Miss Kolkata
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2024 | 1:30 PM

వైరల్ వీడియోలో ఓ యువతి రీల్స్‌ పిచ్చితో రెచ్చిపోయింది. ఏకంగా ఇండియా గేట్ ముందు వెకిలి చెష్టాలకు పాల్పడింది. ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా కేవలం ఒక టవల్ చుట్టుకొని డ్యాన్స్ చేసింది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలోని ‘మేరే ఖ్వాబోన్ మే జో ఆయే పాటకు రెచ్చిపోయి స్టెప్పులేసింది. ఈ పాటలో హీరోయిన్‌ కాజోల్ బాత్ రూమ్ లో టవల్ వేసుకుని డ్యాన్స్ చేసింది. అయితే, ఇప్పుడు ఇండియా గేట్ ముందు ఈ పాటపై అమ్మాయి డ్యాన్స్ చేయడంతో అందరూ షాక్‌ అవుతున్నారు.

సమాచారం మేరకు.. ఈ అమ్మాయి మిస్ కోల్‌కతా అని తెలిసింది. ఆమె పేరు సన్నతి మిత్ర. ఆమె తన వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూనే ఉంటుంది. కానీ, ఈ సారి మాత్రం ఇలాంటి వీడియో చేసింది. ఇండియా గేట్ ముందు టవల్ ధరించి డ్యాన్స్ చేయటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, సోషల్ మీడియాలో భిన్నమైన వ్యాఖ్యలు వస్తున్నాయి. ఒకరు దీనిపై స్పందిస్తూ..ఈ లోకం ఎటు పోతుందని ఆందోళన వ్యక్తం చేయగా, రీల్స్‌ పిచ్చి అన్ని పరిమితులను దాటిందని పేర్కొన్నారు.. దీనిపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఒకరు రాశారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు ఎక్కడ ఉన్నారని మరొకరు రాశారు. అటువంటి బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలతను ప్రోత్సహించడం చేసిన వారిని కటకటాల్లోకి నెట్టాలంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇదిలా ఉంటే, నవరాత్రుల సమయంలో కూడా ఈ అమ్మాయికి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు సన్నతి పొట్టి బట్టలు వేసుకుని దుర్గా పండల్ దగ్గరకు వెళ్ళింది. మరో వీడియోలో, ఆమె టీ తాగడానికి బికినీ ధరించి టీ దుకాణానికి వెళ్లింది. అలాంటి బట్టలు వేసుకోవడంలో తప్పేమీ లేదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?