వారెవ్వా.. ఎమ్మెల్యే అంటే మీరే సారూ.. డ్రైవర్‌ పెళ్లిలో ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

సాధారణంగా రాజకీయ నాయకులు మన ఇళ్లలో ఏదైనా కార్యక్రమానికి వస్తే.. ఆ హడావుడి మామూలుగా ఉండదు.. వారికి ప్రత్యేకించి రాచమర్యాదలు చేస్తుంటారు. వారితో స్పెషల్ సీటింగ్‌, విందుభోజన ఏర్పాట్లు చేయాల్సి వుంటుంది. ఏదైనా పెళ్లికి ఓ ఎమ్మెల్యే వచ్చాడంటే.. ఇక వారి రాకతో పెళ్లి వచ్చిన వారంతా వధూవరులను మర్చిపోయి సదరు నాయకులకు సలామ్‌ కొడుతూ, ఫోటోలు దిగేందుకు ఎగబడుతుంటారు.. కానీ, ఇక్కడో ఎమ్మెల్యే తన డ్రైవర్‌ పెళ్లిలో ఏం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు..

వారెవ్వా.. ఎమ్మెల్యే అంటే మీరే సారూ.. డ్రైవర్‌ పెళ్లిలో ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
Bjp Mla Drives Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2024 | 1:07 PM

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా ధన్‌ఘటా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ప్రజలు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే అతని డ్రైవర్ పెళ్లికి సంబంధించిన వీడియో ఇది. డ్రైవర్ పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే చేసిన ఊహించని పనితో పెళ్లికి వచ్చిన బంధువులు, స్థానికులు అంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. ధన్‌ఘటా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చౌహాన్‌ తన డ్రైవర్‌ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అంతేకాదు.. వరుడు కూర్చున్న కారును ఎమ్మెల్యే స్వయంగా నడుపుతూ అందరినీ ఔరా అనిపించేలా చేశారు.

వైరల్‌ వీడియోలో కారులో వరుడి గెటప్‌లో ఉన్న వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చౌహాన్ డ్రైవర్. విపిన్ మౌర్య వివాహం సందర్భంగా అతను పెళ్లి దుస్తులు ధరించి పెళ్లి ఊరేగింపుకు రెడీ అయ్యాడు.. కానీ తన కారును దాని యజమాని ఎమ్మెల్యే గణేష్ చౌహాన్ స్వయంగా నడుపుతాడని అతను కూడా అనుకోలేదు. గణేష్ చౌహాన్ కారు స్టీరింగ్ సీటుపై కూర్చుని మండపం వరకు కారు నడిపాడు. తన డ్రైవర్ విపిన్ మౌర్య పెళ్లిలో ఎమ్మెల్యే స్వయంగా వరుడి కారు నడుపుతూ పెళ్లి మండపానికి తీసుకొచ్చారు.. తన పక్కనే వరుడు గెటప్‌లో ఫోటోలకు పోజులిస్తూ కూర్చున్నాడు డ్రైవర్. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున స్పందించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఎమ్మెల్యే సింప్లిసిటీ, తమ ఉద్యోగుల పట్ల కలిగి ఉన్న ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారిని చూసైన మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలంటూ చాలా మంది వ్యాఖ్యనించారు. వీరి మధ్య సెంటిమెంట్ ఏదైనా కావచ్చు, చొరవ బాగుందని ఒకరు రాశారు. ప్రజాప్రతినిధులు ఇలాగే ఉండాలంటూ ఇంకొకరు రాశారు! మొత్తానికి ఓ ఎమ్మెల్యే తన డ్రైవర్‌ కోసం తానే స్వయంగా కారు నడపటం చర్చనీయాంశంగా మారింది.